స్టూడెంట్ గా – సీఈవో గా- రైతుగా త్రీ- డైమన్షన్స్ ఉన్న పాత్రలో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ సూపర్బ్

Maharshi Telugu Movie Review,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviewws,Maharshi Review,Maharshi Movie Review,Maharshi Movie Review and Rating,Maharshi Movie Plus Points,Maharshi Movie Live Updates,Maharshi Movie Public Talk,Maharshi Movie Public Response,Maharshi Telugu Movie Story,#MaharshiReview
Maharshi Telugu Movie Review

కమర్షియాలిటీ పేరుతో ఏవో పిచ్చి కథలకు కమర్షియల్ హంగులు అద్ది రెండున్నర గంటల నాన్సెన్స్ ను జనం మీద రుద్దేసే ట్రెండ్ ఇప్పుడు బాగా తగ్గింది.  తీసుకుంటున్న కథాంశాలకు కొంత సామాజిక నేపథ్యాన్ని, సోషల్ ఎవేర్ నెస్ ను జోడించి మంచి ఇన్స్పైరింగ్ క్యారెక్టరైజేషన్స్ తో పర్పస్ ఫుల్ ఫిలిమ్స్ తీస్తున్నారు మన దర్శక నిర్మాతలు. వీటిలో కూడా కమర్షియల్ హంగులు, ఆర్భాటాలు ఉన్నప్పటికీ అండర్ కరెంట్ గా మంచి మెసేజ్ వుండటం అభినందనీయం. గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి రెండు  చిత్రాల ద్వారా చాలా చక్కని ఆచరణాత్మక సందేశాలను ఇస్తూనే కమర్షియల్ గా కూడా అద్భుత విజయాలను అందుకున్న యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అదే కోవలో మరో సోషల్ అవేర్నెస్ కలిగించే ఇన్స్పైరింగ్ కథాంశంతో ముందుకు రావడం అభినందనీయం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన” మహర్షి” చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ముగ్గురు అగ్ర నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, పొట్లూరి వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన “మహర్షి” ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రిషి( మహేష్ బాబు) కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న “ఆరిజిన్” అనే సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవోగా అపాయింట్ అవుతాడు. ఒక తెలుగువాడు అమెరికాలో అంతటి ఉన్నత స్థాయికి ఎదగటం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతాయి. ఆ సందర్భంగా కొలీగ్ ఇచ్చిన సర్ ప్రైజ్ పార్టీలో ఊహించిన విధంగా ఇండియా నుండి తన మిత్ర బృందం అందరూ వస్తారు. విశాఖపట్నం లో చదువుకునే రోజుల్లో తనను ఎంతగానో ఎంకరేజ్ చేసిన ప్రొఫెసర్( రావు రమేష్) తో సహా అందరూ వచ్చిన ఆ పార్టీలో రవి (అల్లరి నరేష్) పూజ ( పూజ హెగ్డే) కనిపించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రవి ఎందుకు రాలేదు…? అసలు వాడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? పూజ ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది అని వాకబు చేసిన మహర్షి ప్రొఫెసర్ చెప్పిన సమాధానం విని షాక్ అవుతాడు. తనకోసం రవి చేసిన శాక్రిఫైజ్ ఏమిటో తెలుసుకున్న తరువాత మహర్షి ఒక్క నిమిషం కూడా అమెరికాలో ఉండలేకపోతాడు.

తన సీఈఓ పదవికి లాంగ్ లీవ్ పెట్టేసి ఇండియాకు వచ్చేస్తాడు. నేరుగా రవి వాళ్ల సొంత ఊరు రామవరం వెళ్తాడు. అక్కడ ఒక నిరాహార దీక్ష శిబిరంలో ఒంటరిగా ఒక్కడే కూర్చుని ఉంటాడు రవి. అతను ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు.? అతని తండ్రి ఎందుకు చనిపోయాడు… ? రవి చేస్తున్న నిరాహార ఉద్యమం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అంతకుముందు కాలేజీలో లవర్స్ గా ఉన్న రిషీ – పూజ ఎందుకు విడిపోయారు.? వాళ్ల లవ్ బ్రేకప్ కు  కారణం ఏమిటి? సక్సెస్ ఒక్కటే జీవిత పరమావధిగా పరుగులు తీసిన రిషి  సక్సెస్ కు అసలు నిర్వచనం, అర్థం ఏమిటో ఎలా రియలైజ్ అయ్యాడు? తన తల్లిదండ్రులు( జయసుధ, ప్రకాష్ రాజుల ) తో మహర్షి అనుబంధం ఏమిటి? ఇత్యాది ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం గా నిలుస్తుంది మహర్షి ద్వితీయార్థం.

డీలింగ్ ఆఫ్ ద సబ్జెక్టు ఎలా ఉంది? 

మహర్షి చిత్రానికి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లికి మంచి ట్రాక్  రికార్డు ఉంది. ప్రభాస్ హీరోగా నిర్మితమైన “మున్నా” దర్శకుడిగా వంశీ పైడిపల్లి  తొలిచిత్రం. తర్వాత ఎన్టీఆర్ హీరోగా బృందావనం, రామ్ చరణ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఎవడు,  నాగార్జున హీరోగా ఊపిరి చిత్రాల దర్శకుడిగా వంశీ పైడిపల్లికి మంచి పేరుంది. ముఖ్యంగా హీరోను ఎలివేట్ చేస్తూ మంచి కేరక్టరైజేషన్ క్రియేట్ చేయడంలో వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. ఈ చిత్రంలో కూడా మహేష్ బాబు క్యారెక్టర్ ను స్టూడెంట్ గా, సీఈవో గా, రైతు గా మూడు dimensions లో  ప్రజెంట్ చేసి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాడు వంశీ పైడిపల్లి. ఈ కథలో యూత్ కు కావలసిన ఇన్స్పిరేషన్, ఫ్రెండ్షిప్, లవ్, శాక్రిఫైజ్, యాక్షన్ వంటి పేయింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. “సక్సస్ కు కామా లే తప్ప ఫుల్స్టాప్ లు ఉండవు … జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం” అనే చక్కని స్ఫూర్తిదాయక సందేశాన్ని యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలాగా సబ్జెక్టును డీల్ చేసాడు వంశీ పైడిపల్లి.

పర్ఫార్మెన్స్:

ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే సినిమా మొత్తం కనిపించేది మహేష్ బాబు ఒక్కరే. పర్ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో మహేష్ బాబు చాలా కమిటెడ్ గా, కాన్ఫిడెన్స్ గా కనిపించారు. అలాగే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కు scope ఉన్న మరొక పాత్ర అల్లరి నరేష్ పోషించిన రవి క్యారెక్టర్. ఆ పాత్రలో అల్లరి నరేష్ చాలా చక్కని సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ పూజా హెగ్డే పోషించిన పూజ పాత్రలో అప్పీరెన్స్ కు తప్ప పర్ఫార్మెన్స్ కు పెద్దగా స్కోప్ లేదు. అలాగే మిగిలిన అన్ని పాత్రలు ఆర్టిస్టుల ఇమేజ్  కారణంగా ఎలివేట్ అయినవే తప్ప గొప్పగా నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు కావు.

హీరో తల్లిదండ్రులు గా నటించిన ప్రకాష్ రాజ్, జయసుధ ల పాత్రల తాలూకు ఇంపాక్ట్ బలంగా ఉన్నప్పటికీ లెంగ్త్ అండ్ ప్రయారిటీ విషయంలో చెప్పుకోదగ్గ గొప్ప పాత్రలు కావు. అలాగే కార్పోరేట్ విలన్ గా  జగతిబాబు , ప్రొఫెసర్  గా రావు రమేష్,ఎంపీగా పోసాని కృష్ణ మురళి, నరేష్ మేనమామగా సాయి కుమార్, మహేష్ పిఏ గా శ్రీనివాస రెడ్డి, ఫ్రెండ్ గా వెన్నెల కిషోర్ తదితరులు పాత్రోచితంగా నటించారు. ముసలి రైతు గా నటించిన వ్యక్తి ఎవరో తెలియదు గాని అతని నుండి నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాడు దర్శకుడు.

ఇక టెక్నికల్ గా చూస్తే మొదటి నుండి మహేష్ బాబు ప్రత్యేకంగా అభినందిస్తున్న కెమెరామెన్ మోహనన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముగ్గురు అగ్ర నిర్మాతలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రొడక్షన్ వాల్యూస్  సూపర్బ్  అనిపించాయి.

మొత్తం మీద మహేష్ బాబు స్థాయి సూపర్ స్టార్ నుండి యూత్ కు చాలా చక్కని మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడం కోసం వంశీ పైడిపల్లి చేసిన చక్కని సఫలీకృత ప్రయత్నంగా మహర్షి చిత్రాన్ని అభినందించవచ్చు. అయితే ఈ సినిమా విషయంలో ఆక్షేపించదిగిన ప్రధాన లోపం లెంగ్త్.

సినిమా మొత్తం మోస్ట్ ఎంజాయ్ బుల్ గా , ఇన్స్పిరేషనల్ గా అలరిస్తుంది “మహర్షి”. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో తన 25 వ చిత్రంగా ఇలాంటి సోషల్ రిలవెన్స్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ కంటెంట్ తో రావటం అభినందనీయం.

మహర్షి తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
4

[subscribe]

[youtube_video videoid=wSEr9WhfF9M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =