ర‌వితేజ ‘కిక్’కి ప‌దేళ్ళు

10 Years For Ravi Teja Kick Movie,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Kick Movie Latest Updates,Ravi Teja Kick Movie Completes 10 Years,Kick Movie Turns 10 Years,10 Years Of Kick Movie
10 Years For Ravi Teja Kick Movie

ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిల‌చిన హీరోల్లో మాస్ మ‌హ‌రాజా రవితేజ ఒక‌రు. వినోదానికే పెద్ద పీట వేసే ర‌వితేజ‌… ప‌లు యాక్ష‌న్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అటువంటి ఎంటర్‌టైనర్‌లలో ‘కిక్’ ఒకటి. నలుగురికి మంచి చేయడంలో ఉండే కిక్... మ‌రెందులోనూ ఉండ‌దనే ఇతివృత్తంతో ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ర‌వితేజ‌కి జోడీగా ఇలియానా నటించిన‌ ఈ చిత్రంలో షాయాజీ షిండే, ప్రభ, బ్రహ్మానందం, శ్యామ్, రావు రమేష్, జయప్రకాష్ రెడ్డి, అలీ, కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. రవితేజ కెరీర్‌లో “వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్” గా నిలిచిన కిక్‌ 2009 మే 8న విడుదలై… నేటితో ప‌దేళ్ళు పూర్తిచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కిక్’ – కొన్ని విశేషాలు:

  • రవితేజ, ఇలియానా జంటగా న‌టించిన‌ రెండో చిత్రం ‘కిక్’. అంతకుముందు వీరిద్దరూ ‘ఖతర్నాక్’ సినిమాలో అల‌రించారు. అలాగే ‘కిక్’ తర్వాత ‘దేవుడు చేసిన మనుషులు’, ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రాల్లో జోడీ క‌ట్టారు.
  • రవితేజ, దర్శకుడు సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన తొలి చిత్రమిది. దర్శకుడిగా సురేందర్ రెడ్డికి ఇది నాలుగో చిత్రం (అంతకుముందు ‘అతనొక్కడే’, ‘అశోక్’, ‘అతిథి’ చిత్రాలు ఉన్నాయి). ఆ త‌రువాత ర‌వితేజ‌, సురేంద‌ర్ కాంబినేషన్‌లో ‘కిక్’కు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందింది.
  • సంగీత దర్శకుడిగా తమన్‌కు మంచి గుర్తింపునిచ్చిన చిత్రం ‘కిక్. ఈ సినిమా తర్వాత రవితేజ, తమన్ కాంబినేషన్‌లో ‘మిరపకాయ్’, ‘బలుపు’, ప‌వ‌ర్‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న డిస్కో రాజా… వీరి కాంబోలో ప‌దో చిత్రం కావ‌డం విశేషం.
  • ఈ చిత్రాన్ని తమిళంలో ‘జయం’ రవి హీరోగా ‘తిల్లాలంగడి’ పేరుతోనూ, కన్నడంలో ఉపేంద్ర హీరోగా ‘సూపర్ రంగ’ పేరుతోనూ రీమేక్ చేసారు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిక్’ పేరుతోనే రీమేక్ చేయడం విశేషం. అంతేకాదు… ఈ మూడు భాష‌ల్లోనూ ఈ సినిమా విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =