అవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ

Avengers Endgame Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Avengers Endgame Movie Updates,Avengers Endgame Telugu Movie Latest News,Avengers Endgame Movie Review,Avengers Endgame Movie Public Talk,Avengers Endgame Telugu Movie Public Response,Avengers Endgame Movie Live Updates,Avengers Endgame Telugu Movie Review And Rating
Avengers Endgame Telugu Movie Review

తెలుగు, తమిళ్, హిందీ ఇలా ఒక్క భాష కాదు.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది అవెంజర్స్ ఎండ్ గేమ్ లో లాస్ట్ సిరీస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అవెంజర్స్ ఫీవరే ఉంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తే అర్ధమవుతుంది… ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో. మన దేశంలోనే 25 లక్షల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇంత వరకూ ఏ హాలీవుడ్ మూవీకి సాధ్యం కాని రీతిలో ఈ చిత్రం కోసం బుక్ మై షోలోనూ ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకున్నారు. అవెంజర్స్ నుండి 4 వ సిరీస్.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ 22వ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో? ఏంటో? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే

నటీనటులు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌
దర్శకత్వం : ఆంథోనీ రుస్సో, జో రుస్సో
నిర్మాత : కెవిన్ ఫీగే మరియు స్టాన్ లీ
సంగీతం : అలాన్ సిల్వెస్ట్రీ
సినిమాటోగ్రఫర్ : ట్రెంట్ ఓపాలోచ్
ఎడిటర్ : జెఫ్రీ ఫోర్డ్

కథ :

అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో థానోస్‌ ఈ భూమి మీద ఉన్న సగం జనాన్ని నాశనం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి నుండే ఈ సిరీస్ మొదలవుతుంది. ఇన్ఫినిటీ వార్ లో ఓటమిపాలైన అవెంజర్స్ తమ వాళ్లను కోల్పోయిన బాధలో .. తమ శక్తిని వదిలేసి ఆ జ్ఞాపకాలతో తమ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో సూపర్ హీరోస్ అందరూ మళ్లీ కలిసి, చనిపోయిన తమ వాళ్ళను బతికించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో వారికి ఓ విషయం తెలుస్తుంది. టైం మేషీన్‌ ద్వారా గతంలోకి వెళ్లి, థానోస్‌ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగించిన మణులను సాధించగలిగితే.. చనిపోయిన వారందరినీ తిరిగి బతికించగలమని తెలుస్తోంది. దానికోసం సిక్స్ స్టోన్స్ ను మళ్లీ సాధించాలనుకుంటారు. మరి అవెంజర్స్ ఆ స్టోన్స్ ను సాధించారా ? తిరిగి తమ వాళ్ళను బతికించుకున్నారా ? స్టోన్స్ ను సాధించుకునే క్రమంలో థానోస్‌ నుంచి వారికి ఎలాంటి అవాంతరాలు అడ్డంకులు ఎదురయ్యాయి..? సూపర్ హీరోస్ అందరూ కలిసి థానోస్ ను ఎలా ఎదుర్కొన్నారు..? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి ఈసినిమా గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పడానికి ఏం ఉండదు. మొదటి నుండి ఈ సూపర్ హీరోస్ లను.. అవెంజర్ సినిమాలను ఫాలో అయ్యే వాళ్లకి అర్ధమవుతుంది..ఫాలో అవ్వని వారికి ఈ భాగం కొంత కన్ఫ్యూజన్ గా అనిపించడం సహజం. ఇక సినిమా విషయానికొస్తే అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఒకటి రెండు అని కౌంట్ చేసి చెప్పడం కష్టం కానీ.. సినిమా చూసిన వారికి ఆ ఫీలింగ్ తెలుస్తుంది.

ఐరన్ మ్యాన్, హల్క్, థోర్, ఇలా ప్రతి ఒక సూపర్ హీరో క్యారెక్టర్ ప్రేక్షకులను అలరిస్తుంది. వారి వారి పాత్రల్లో నటించిన స్టార్ నటీ నటులు తమ నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అవెంజర్స్‌ సిరీస్‌లో కనిపించిన ప్రతీ సూపర్ హీరోను క్లైమాక్స్‌లో భాగం చేసి అభిమానులకు మరింత కనువిందు చేశారు చిత్రయూనిట్. ఈ సిరీస్‌లోని గత చిత్రాలు ఎక్కువగా హీరోయిజం, కామెడీ, యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కగా.. ఎండ్‌ గేమ్‌ మాత్రం అనుబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా తెరకెక్కించారు. థానోస్ ను ఎదురుకునే క్రమంలో వచ్చే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

మరో చెప్పుకోదగిన విషయం ఏంటంటే.. రానా డబ్బింగ్. థానోస్ క్యారెక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానా వాయిస్, రానా డైలాగ్ మాడ్యులేషన్ పర్ఫెక్ట్‌ గా సరిపోయాయి. అలాగే డైలాగ్స్ లో అక్కడక్కడా తెలుగు సినిమాల పేర్లను వాడటం వల్లన తెలుగు నేటివిటీకి సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేశారు.

సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంటుంది.. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్స్ట్ తో ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే.. గత చిత్రాలు చూడని వారికి కాస్త గందరగోళంగా అనిపించినా.. చూసిన వారికి మాత్రం కొత్త అనుభూతిని ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here