మ‌రోసారి సంక్రాంతికి రానున్న `డిస్కో రాజా`?

Ravi Teja Disco Raja for 2020 Sankranthi,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Disco Raja Movie Released on 2020 Sankranthi,Ravi Teja Disco Raja Movie Latest Updates,Disco Raja Movie Latest News,Telugu Movies Releasing For 2020 Sankranthi,Upcoming Films For 2020 Sankranti
Ravi Teja Disco Raja for 2020 Sankranthi

మాస్ మ‌హరాజా ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సైంటిఫిక్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌వితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అంతేకాదు… పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ వీఐ ఆనంద్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే ఓ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. కాగా… త‌దుప‌రి షెడ్యూల్ మే మూడో వారం నుంచి జ‌రుగ‌నుంద‌ని స‌మాచారం. ఆ పై శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర్క్‌పై దృష్టి సారించ‌నున్నార‌ని తెలిసింది. అలాగే… సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదివ‌ర‌కు సంక్రాంతి సీజ‌న్‌లో ర‌వితేజ హీరోగా ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ‌, శంభో శివ శంభో, మిర‌ప‌కాయ్‌ చిత్రాలు రాగా… వీటిలో కృష్ణ‌, మిర‌పకాయ్‌ ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో డిస్కో రాజా కూడా అదే బాట‌లో వెళుతుందేమో చూడాలి. పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా నటేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న డిస్కో రాజా చిత్రాన్ని రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు.

[subscribe]


[youtube_video videoid=oFiUUrzcZ2g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 12 =