వరుస సినిమాలతో క్యాలెండర్ బిజీ

Rashmika Mandanna Gets Busy With Back to Back Movies,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rashmika Mandanna Busy With Her Upcoming Projects,Rashmika Mandanna Next Film Updates,Rashmika New Movie News,Rashmika Bags an Interesting Projects For Next
Rashmika Mandanna Gets Busy With Back to Back Movies

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విషయం ఎవరికీ అర్ధమైనా అర్థకాకపోయినా హీరోయిన్లకు మాత్రం బాగా అర్దమవుతుంది. కెరీర్ ప్రారంభంలో కరెక్ట్ హిట్ పడిందంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఇక ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటారు. ఇక గత రెండు మూడేళ్లలో ఎంతో మంది కొత్త కథానాయకలు టాలీవుడ్ కు పరిచయమయ్యారు. వారిలో కొంత మంది మాత్రం వరుస సినిమాలతో.. తీరిక లేకుండా షూటింగ్‌లతో గడుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లక్కీ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ కుర్రకారు హృదయాల్ని దోచుకున్న ఈ భామ… ఛలో సినిమాతో తెలుగు యూత్ కు కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ హిట్టవ్వడంతో ఇక రష్మికకు వరుస పెట్టి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇక రష్మిక ప్రస్తుతం.. విజయ్‌దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతున్నది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా ఖరారైనట్లు సమాచారం. దీనితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటించనున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా రష్మికనే ఎంపిక చేశారని వినిపిస్తున్నది. అంతేకాదు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా అనుకుంటున్నారట.

కేవలం తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. శివకార్తికేయన్ హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర ఆమెకు లభించినట్టు తెలుస్తోంది. కన్నడంలో పొగరు సినిమాలో ఆమే నాయిక. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమల్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారింది. ఇక రష్మిక కూడా తన దగ్గరకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా.. రెండేళ్ల వరకూ తన క్యాలెండర్ నింపేసింది. మొత్తానికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తారాపథంలో దూసుకుపోతున్నది ఈ భామ. మరి చూద్దాం ఈ జోరు ఎంతవరకూ కొనసాగుతుందో…

[subscribe]


[youtube_video videoid=r6yjcLgY8p4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + six =