ఉత్తేజ్ ప్రారంభించిన మయూఖా యాక్టింగ్ స్కూల్ కు నా అండ దండలు ఎప్పుడూ ఉంటాయి- పూరి జగన్నాథ్

Puri Jagannadh About Uttej Mayukha Film Acting School,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Puri Jagannadh About Uttej Mayukha Acting School,Uttej Mayukha Film Acting School Latest Updates,Director Puri Jagannadh Few Words on Uttej Acting School
Puri Jagannadh About Uttej Mayukha Film Acting School

“మా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు కావాలి.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న “మయూఖా టాకీస్  ఫిలిం యాక్టింగ్ స్కూల్ ” మంచి ఆర్టిస్టులను ఇండస్ట్రీకి అందించగలదన్న నమ్మకం నాకుంది” అన్నారు సుప్రసిద్ధ దర్శకులు పూరి జగన్నాథ్. ఈరోజు ఉదయం హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో “మయూఖా టాకీస్” యాక్టింగ్ స్కూల్ ను  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు పూరి జగన్నాథ్. 

ప్రముఖ నటుడు రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్ ఉత్తేజ్ ప్రారంభించిన “మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్” ప్రారంభోత్సవానికి పూరి జగన్నాథ్, ముఖ్య అతిథిగా విచ్చేయగా ప్రముఖ నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి, ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్, మ్యాంగో మ్యూజిక్ అండ్ మ్యాంగో న్యూస్ అధినేత రామకృష్ణ వీరపనేని,   ప్రముఖ రచయిత నడిమింటి నరసింహారావు తదితరులు హాజరయ్యారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఉత్తేజ్ మాట్లాడుతూ” అత్యుత్తమ  ప్రమాణాలతో ఒక ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభించాలనే కోరిక ఎప్పటినుంచో ఉన్నప్పటికీ సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ దొరికినప్పుడు మాత్రమే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ సక్సెస్ అవుతాయి…

అలాంటి ఫ్యాకల్టీ  దొరికింది కాబట్టే ఈరోజు “మయూఖ ఫిలిం యాక్టింగ్ స్కూల్ ” ను ప్రారంభిస్తున్నాను. “ఇలాంటి యాక్టింగ్ స్కూల్ ఒకటి ప్రారంభించు..  మా అండదండలు ఎప్పుడూ ఉంటాయి అని పూరి జగన్నాథ్ , కృష్ణవంశీ, సురేందర్ రెడ్డి, జె.డి.చక్రవర్తి, నందిని రెడ్డి వంటి ప్రముఖ దర్శకులు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వారి ప్రోత్సాహ బలంతోనే ఈ రోజున ఈ యాక్టింగ్ స్కూల్ ప్రారంభిస్తున్నాను. 
నా ప్రయత్నాన్ని అభినందిస్తూ వీరందరూ ఇచ్చిన మెసేజ్  లు చూసి ఇంకా ఎంతోమంది సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అల్లు శిరీష్ స్వయంగా ఫోన్ చేసి నేను ఇనిస్టిట్యూట్లో చేరతాను అని ముందుకు రావటం, అల్లు అర్జున్ గారు వీలు చూసుకుని తప్పకుండా ఒకరోజు స్కూల్ కు వస్తాను… మీ స్టూడెంట్స్ తో, ఫ్యాకల్టీతో కొంత టైం స్పెండ్ చేస్తాను”- అని చెప్పటం చాలా ఆనందంగా ఉంది.

ఈరోజు నుండి ప్రారంభమయ్యే తొలి బ్యాచ్ క్లాసెస్ రెండు నెలల పాటు జరుగుతాయి. వ్యక్తిగతంగా ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ ఫోకస్ చేయటం కోసం 32 అప్లికేషన్స్ వచ్చినప్పటికీ బ్యాచ్ కి కేవలం 18 మంది స్టూడెంట్స్ ను మాత్రమే తీసుకున్నాము. దీంతో ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ పూర్తయ్యాయి. పూరి జగన్నాథ్ గారు, జెడి చక్రవర్తి గారు, లక్ష్మీ భూపాల్ గారు, నడిమింటి నరసింహారావు, జర్నలిస్ట్ ప్రభు గారు తదితర ప్రముఖులు  అందరు విచ్చేసి  మా మయూఖ యాక్టింగ్ స్కూల్ కు తమ అంద దండలు ఉంటాయని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు” అన్నారు.

ముఖ్య అతిథి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “ఉత్తేజ్ గత 32 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడు. నన్ను రాంగోపాల్ వర్మ గారికి పరిచయం చేసి నేను దర్శకుడు కావటానికి కారకుడైన ఉత్తేజ్ ఈరోజు యాక్టింగ్ స్కూల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నటుడిగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాక్టింగ్ కోచ్ గా ఉత్తేజ్ కు ఉన్న అనుభవం అపారం. మా అబ్బాయి ఆకాష్ కు కూడా ఉత్తేజ్ దగ్గరే ట్రైనింగ్ ఇప్పించాను. ఉత్తేజ్ ప్రారంభించిన ఈ యాక్టింగ్ స్కూల్ కు నా అండదండలు పూర్తిగా ఉంటాయని హామీ ఇస్తున్నాను” అన్నారు.

ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ “నా చిరకాల మిత్రుడైన  ఉత్తేజ్ లో మంచి నటుడే కాదు.. మంచి దర్శకుడు, రచయిత కూడా ఉన్నారు. మంచి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో తను ఇచ్చే శిక్షణ ఫాలో అయితే మీరంతా నటనలో తప్పకుండా గొప్పగా రాణిస్తారు. మంచి స్టాండర్డ్స్ తో, క్రమశిక్షణతో ప్రారంభమైన ఈ “మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్” అతి త్వరలోనే ఒక అగ్రశ్రేణి ఫిలిం ఇనిస్టిట్యూట్ గా ఎదుగుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

మ్యాంగో మ్యూజిక్ అండ్ మ్యాంగో న్యూస్ అధినేత “వీరపనేని రామకృష్ణ” మాట్లాడుతూ – ” ఉత్తేజ్ ఒక మంచి నటుడిగా, మంచి మిత్రుడిగా నాకు చాలా కాలం నుండి  పరిచయం. తను ప్రారంభించిన “మయూఖా  టాకీస్ యాక్టింగ్ స్కూల్” కు అన్ని విధాల నా అండదండలు ఉంటాయి” – అన్నారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, సీనియర్ రైటర్ నడిమింటి నరసింహారావు తదితరులు తమ ప్రసంగాలలో


” మయూఖా టాకీస్ యాక్టింగ్” స్కూల్ పురోభివృద్ధిని ఆకాంక్షించారు.నటన పట్ల ఆసక్తి తో వచ్చే స్టూడెంట్స్ అవసరాన్ని క్యాష్ చేసుకునే ఇన్స్టిట్యూట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో  ప్రమాణాలతో, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో   యాక్టింగ్ స్కూల్ ను ప్రారంభిస్తున్న ఉత్తేజ్ కు ఫిలిం ఇండస్ట్రీ నుండి పూర్తి సాయి మద్దతు లభిస్తుంది అనటంలో సందేహం లేదు. కార్యక్రమం చివరిలో ఇటీవల దివంగతులైన ప్రముఖ నటులు, నట శిక్షకులు  “దీక్షితులు” ఆత్మశాంతిని  ఆకాంక్షిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు. చివరిగా తమ “మయూఖా టాకీస్ యాక్టింగ్ స్కూల్ ” ప్రారంభోత్సవ  కార్యక్రమానికి విచ్చేసి అభినందనలు తెలిపిన అందరికీ ఉత్తేజ్ కృతజ్ఞతలు చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here