నాని, సుధీర్ బాబు ల మల్టీస్టారర్ కు ముహూర్తం ఫిక్స్

Nani and Sudheer babu Multistarrer in Indraganti Direction,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani and Sudheer babu New Movie Updates,Nani and Sudheer babu Multistarrer Film Launch on April 26th ,Nani and Sudheer babu New Movie Launch Date Confirmed,Nani and Sudheer babu Next Film Gets a Launch Date
Nani and Sudheer babu Multistarrer in Indraganti Direction

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ల కాంబినేషన్ లో మల్టీస్టారర్ తెరకెక్కబోతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని టాక్స్ వినిపించాయి. అయితే ఆ తరువాత అది కూడా కాదన్న వార్తలు వినిపించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమాను ఈ నెల 26 వ తేదీన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి, నివేదా థామస్ కథానాయికలుగా నటించనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు.

మరి గతంలో ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్ మేన్’ వంటి హిట్స్ అందించిన ఇంద్రగంటి.. ‘సమ్మోహనం’ లాంటి హిట్ చిత్రాన్ని సుధీర్ బాబు, కు అందించాడు. మరి వీరి ముగ్గురి కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అంతేకాదు నివేదా థామస్, అదితి రావుకు కూడా ఇంద్రగంటి తో ఇది రెండో సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో?.. ఈ సినిమా వీరికి సక్సెస్ అందిస్తుందో? లేదో? చూద్దాం..

[subscribe]


[youtube_video videoid=hxQbCD_2oaw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =