తెలుగు సినిమాకు నవరత్నాలను అందించిన ప్రాతఃస్మరణీయ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు

Best Film From Poornodhaya Art Creations,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,The Best Films of Producer Edida Nageswara Rao,Vote For Your Favourite Movie From Poornodhaya Art Creations,Choose One Best Film From Poornodhaya Art Creation
Best Film from Poornodhaya Art Creations

“ఎంత పూత పూసింది అన్నది కాదు ఎన్ని పండ్లు వచ్చాయి అన్నది ముఖ్యం”- “గంగిగోవు పాలు గరిటడైనను చాలు”-“రాశి కాదు వాసి ముఖ్యం”-

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తక్కువ ప్రయత్నాలలో ఎక్కువ ఫలితాలను రాబట్టిన వ్యక్తులను, సంస్థలను అభినందించే సందర్భంలో ఇలాంటి ఉపమానాలను వాడుతుంటారు. ఇలాంటి అభినందనలకు శతవిధాల అర్హుడైన నిర్మాత కీర్తిశేషులు ఏడిద నాగేశ్వరరావు. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను దశ దిశ వ్యాప్తం చేసిన అతి తక్కువ మంది నిర్మాతలలో ఒకరైన ఏడిద నాగేశ్వరరావు తన జీవిత కాలంలో నిర్మించిన చిత్రాల సంఖ్య కేవలం పదంటే పది మాత్రమే. ఆయన నిర్మించిన 10 చిత్రాలలో 9 చిత్రాలు అఖండ విజయాలను సాధించటంతో పాటు తెలుగు సినిమా ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేయటం అభినందనీయం.పదింట 9 చిత్రాలు విజయవంతం కావటం ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డ్.


బహుశా ఇది ఏ  ఇతర నిర్మాతకు దక్కని అరుదైన ఘనత. తెలుగు సినిమా చరిత్రలో అపురూప చిత్రాలుగా నిలిచిపోయే “నవ చిత్ర రత్నా”లను అందించిన ఏడిద నాగేశ్వరరావు 85వ జయంతి ఈరోజు. 1934 ఏప్రిల్ 24 న ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేట లో జన్మించిన ఏడిద నాగేశ్వరరావు 2015 అక్టోబర్ 4న స్వర్గస్తులయ్యారు.తొలిరోజుల్లో రంగస్థల నటుడిగా, సినిమా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక వ్యయ ప్రయాసల, ఒడిదుడుకుల జీవితాన్ని ఎదుర్కొన్నారు ఏడిద నాగేశ్వరరావు. జీవితం తీసుకున్న అనేకానేక మలుపులలో భాగంగా కొందరు స్నేహితుల భాగస్వామ్యంలో నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో  నిర్మించిన “సిరిసిరిమువ్వ” అద్భుత విజయాన్ని సాధించడంతో ప్రారంభమైంది ఏడిద నాగేశ్వరరావు జైత్రయాత్ర.

ఆ వెంటనే కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో నిర్మించిన” తాయారమ్మ బంగారయ్య” హిలేరియస్ హిట్ అయింది. ఇక మూడో ప్రయత్నంగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన సంగీత సాహిత్య సమ్మేళనం” శంకరాభరణం” సాధించిన విశ్వవ్యాప్త విజయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తరువాత భారతీరాజా దర్శకత్వంలో నిర్మించిన సీతాకోకచిలుక, కళాతపస్విగా విశ్వవిఖ్యాతి గాంచిన  కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, వీటి మధ్యలో వంశీ దర్శకత్వంలో నిర్మించిన” సితార” చిత్రాలు పూర్ణోదయ సంస్థకు పరిపూర్ణ విజయాలుగా నిలిచాయి. ఒక్క “స్వరకల్పన”  మినహా “పూర్ణోదయ” వారి మిగిలిన 9 చిత్రాలు తెలుగు సినిమా కీర్తి కిరీటంలో నవరత్నాలుగా తళుకులీనుతూనే ఉంటాయి. 

ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ 9 చిత్రాలలో అన్ని చిత్రాలకు ప్రజల రివార్డులు ప్రజా ప్రభుత్వాల అవార్డులు కోకొల్లలుగా వచ్చాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు దక్కిన గౌరవ ప్రతిష్టలలో పూర్ణోదయ సంస్థకు  సగౌరవమైన, సగర్వమైన వాటా ఉంటుంది. అయితే ఆయన అన్ని సినిమాలకు అవార్డులు రివార్డులు దక్కాయి గాని వ్యక్తిగత స్థాయిలో ఏడిద నాగేశ్వరరావుకు దక్కాల్సిన ప్రభుత్వ అవార్డులు, పురస్కారాలు దక్కలేదు. ప్రాంతీయ స్థాయిలో తెలుగు సినిమాకు విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఇచ్చే 
” రఘుపతి వెంకయ్య అవార్డు”కు అన్ని విధాల అర్హులైన నాగేశ్వరరావుకు మరణానంతరమైనా ఆ అవార్డు ఇవ్వటం సముచితం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే  ” పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్” పతాకంపై ఏడిద  నాగేశ్వరరావు నిర్మించిన 9 చిత్రాలలో దేనికదే “బెస్ట్” అయినప్పటికి వాటిలో “ది బెస్ట్” గా మీకు నచ్చిన చిత్రం ఏది? అని అడిగితే మీ సమాధానం ఏది అవుతుంది? అన్నది “మేటర్ ఆఫ్ క్యూరియాసిటీ”. సో… సరదాగా ఈ పోల్ గేమ్ లో పాల్గొని ” పూర్ణోదయ వారి” అపురూప చిత్రాల నుండి “ఉత్తమోత్తమ” చిత్రాన్ని ఎంపిక చేసి మీ ఉత్తమ అభిరుచిని ఆవిష్కరించుకోండి అభినందనలతో…. మీ” ద తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కం”.

తెలుగు సినిమాకు నవరత్నాలను అందించిన ప్రాతఃస్మరణీయ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు

[subscribe]


[youtube_video videoid=wcdrXwZo198]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fourteen =