ఒకే రోజున ఇద్ద‌రు తెలుగు ద‌ర్శ‌కుల తొలి హిందీ చిత్రాలు

Arjun Reddy and Crazy to Release on June 21,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Arjun Reddy Movie Remake Releasing on June 21,Arjun Reddy Hindi Remake Movie Release Date,Arjun Reddy Hindi Remake Movie Latest Updates,June 2019 Remake Movies Release Dates
Arjun Reddy and Crazy to Release on June 21

జూన్ 21, 2019… ఓ అరుదైన విష‌యానికి వేదిక కానుంది. అదేమిటంటే… అదే రోజున టాలీవుడ్‌కి చెందిన ఇద్ద‌రు యువ ద‌ర్శ‌కులు హిందీనాట త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఆ ద‌ర్శ‌కులు మ‌రెవ‌రో కాదు.. సందీప్ రెడ్డి వంగ‌, కోవెల‌మూడి సూర్య ప్ర‌కాష్‌.అర్జున్ రెడ్డి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని అందించిన సందీప్‌… ఇప్పుడు అదే చిత్రాన్ని క‌బీర్ సింగ్‌ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షాహిద్ క‌పూర్‌, కియ‌రా అద్వాని జంట‌గా న‌టించిన ఈ సినిమా జూన్ 21న రిలీజ్ కానుంది. క‌ట్ చేస్తే… అదే రోజున మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడు, కె.రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు కోవెల‌మూడి సూర్య‌ప్ర‌కాష్ త‌న తొలి హిందీ చిత్రం మెంట‌ల్ హై క్యా? తో బాలీవుడ్‌లో తొలి అడుగులు వేస్తున్నాడు. రాజ్‌కుమార్ రావ్‌, కంగ‌నా ర‌నౌత్ ఇందులో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఓ ఆస‌క్తిక‌ర‌మైన కాన్సెప్ట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు త‌మ త‌మ తొలి హిందీ చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాలు అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]


[youtube_video videoid=jaYTvY7hqBo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 10 =