మహేష్ #26 – అప్పుడు తండ్రి ఇప్పుడు విలన్!

Jagapathi Babu To Play Negative Role in Mahesh Babu Anil Ravipudi Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu and Anil Ravipudi New Movie Updates,Jagapathi Babu To Act in Super Star Mahesh Babu 26th Film,Jagapathi Babu Turns Villain For #Mahesh26 Film,Jagapathi Babu Plays a Villain Role in Mahesh Babu New Movie
Jagapathi Babu To Play Negative Role in Mahesh Babu Anil Ravipudi Movie

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ సిల్వర్ జూబ్లి సినిమా మహర్షి కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు టైం కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను.. పాటలను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మహేష్ 26 సినిమా గురించి కూడా అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మహర్షి తరువాత మహేష్ తన తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో విజయశాంతి, బండ్లగణేష్ లాంటి వాళ్లు నటిస్తున్నట్టు వార్తలు రాగా…ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది.

ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అందువలన ఈ పాత్రకోసం జగపతిబాబు అయితే బాగుంటాడని భావించి ఆయనని సంప్రదించడం .. ఆయన అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. ఇంతకుముందు ఆయన శ్రీమంతుడులో మహేష్ కు తండ్రి పాత్రలో నటించారు. అంతేకాదు మహర్షి లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈసినిమాలో విలన్ గా నటించనున్నాడు. ఇది కనుక నిజమే అయితే.. మహేష్ తో కలిసి నటించడం జగపతి బాబు కు ఇది మూడోసారి అవుతుంది. మరి ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేశ్ బాబుకి తండ్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన జగపతిబాబు, మహేశ్ బాబుతో తలపడే విలన్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.

కాగా దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివారాలు వెలువడనున్నాయి.

[subscribe]


[youtube_video videoid=E_nsZAGJHOM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + three =