మెగాస్టార్ చిత్రంలో అన‌సూయ‌?

Anasuya To Play A Key Role in Megastar Chiranjeevi Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Anasuya Role in Megastar Chiranjeevi New Movie,Anasuya Next in Chiranjeevi Movie,Anasuya To Act in Mega Star Movie,Anasuya Next Project Details,Chiranjeevi and Anasuya To Team Up For Next
Anasuya To Play A Key Role In Megastar Chiranjeevi Movie

అనసూయ… గ్లామ‌ర్ ప్రియుల‌కు పరిచయం చేయ‌న‌క్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి… ఆపై వెండితెర‌పైనా త‌న‌దైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. తొలుత ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నటించిన అనసూయ… ఆ తర్వాత ‘క్షణం’లో కీలకపాత్ర పోషించింది. అలాగే… ‘విన్నర్’ సినిమాలో “సూయ సూయ అనసూయ’ అనే స్పెషల్ సాంగ్‌లో కూడా న‌ర్తించింది. అనంత‌రం ‘గాయత్రి’ సినిమాలో మరోసారి కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఒక విధంగా ఈ కీలక పాత్రలే ఆమెకు ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో ‘రంగమ్మత్త’గా నటించే అవకాశాన్ని కల్పించాయి. ఇక ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఎఫ్-2’ మూవీలోనూ ఓ కామెడీ పాత్రలో నటించి మెప్పించింది అన‌సూయ‌. ఇలా వచ్చిన ప్రతీ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న అనసూయ… ఇప్పుడు మ‌రో మెగా ఆఫర్‌ను చేజిక్కించుకున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాలో ఓ ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం అనసూయను సంప్ర‌దించిందట చిత్ర బృందం. పాత్ర నచ్చడంతో అనసూయ కూడా కాల్షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగార్జున‌, వెంక‌టేష్ వంటి అగ్ర‌క‌థానాయ‌కుల చిత్రాల్లో క‌నిపించి అల‌రించిన అన‌సూయ‌… ఇప్పుడు చిరంజీవి సినిమాతో కూడా త‌న ఖాతాలో మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని వేసుకుంటుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే చిరు సినిమాకి సంబంధించి… మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

[subscribe]


[youtube_video videoid=RJwO-aw5av4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =