య‌న్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’కు 26 ఏళ్ళు

26 Years For Sr NTR Major Chandrakanth Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,26 Years of Major Chandrakanth Movie,Sr NTR Major Chandrakanth Movie Latest News,26 Years Turns For Major Chandrakanth Movie,Sr NTR Major Chandrakanth Movie Completes 26 Years
26 Years For Sr NTR Major Chandrakanth Movie

“ఎవడురా! నా భరత జాతిని కప్పమడిగిన తుచ్ఛుడు” అని ఓ అల్లూరిలా ఎదిరించినా…, “ఒరేయ్ తెల్ల కుక్క… కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాల్రా” అని ఓ కట్టబ్రహ్మన్న‌లా గ‌ర్జించినా…, ఓ శివాజీ లా …, ఓ నేతాజీ లా అల‌రించినా… అది మ‌హాన‌టుడు నందమూరి తారక రామారావు కే చెల్లు. ఒకే పాట కోసం ఇలా ప‌లు చిరస్మ‌ర‌ణీయ వ్య‌క్తుల వ్య‌క్తిత్వాల‌ను తెర‌పై ఆవిష్క‌రించి… మ‌రోసారి మ‌హాన‌టుడు అనే మాట‌కు సార్థ‌క‌త‌కు తీసుకొచ్చారు య‌న్టీఆర్‌. ఆ పాట గ‌ల చిత్ర‌మే… 1993లో విడుద‌లైన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘మేజర్ చంద్రకాంత్’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సిసలైన కమర్షియల్, మాస్ సినిమాలకు అర్ధం, నిర్వచనం చెప్పిన ఆ నటశిఖరానికి… దర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు దర్శక ప్రతిభ తోడైతే ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌రే. అలా బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలవ‌డ‌మే కాకుండా సిల్వ‌ర్ జూబ్లీ కూడా జ‌రుపుకున్న సినిమా ‘మేజర్ చంద్రకాంత్’. అంతేకాదు… అడ‌వి రాముడుతో మొద‌లైన వీరి ప్ర‌యాణంలో ఆఖ‌రి చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. యన్.టి.ఆర్ సినిమా అంటే… కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక అంశాలు కూడా ఉంటాయి. అటువంటి క‌థ‌ను య‌న్‌.టి.ఆర్ కోసం సిధ్ధంచేయడంలో అందెవేసిన చేయి పరుచూరి బ్రదర్స్ ది. ఈ సినిమా కోసం తూటాల్లా పేలే మాటలనూ ర‌చించి మెప్పించారు ఆ సోద‌రులు.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై క‌లెక్షన్ కింగ్‌ మోహన్‌బాబు నిర్మించి న‌టించిన‌ ఈ చిత్రంలో… ఆయ‌న‌కు జోడీగా నగ్మా, ర‌మ్య‌కృష్ణ‌ నటించగా… శారద, సుధ, ప్రసాద్‌బాబు, అమ్రిష్ పూరి, సాయికుమార్, శ్రీహరి తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలను పోషించారు. ఎం.ఎం.కీరవాణి స్వరపరచిన బాణీలు అప్పట్లో ఓ సంచలనం. ముఖ్యంగా… ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చే “పుణ్యభూమి నా దేశం” పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. 1993 ఏప్రిల్ 23న విడుదలైన ‘మేజర్ చంద్రకాంత్’… నేటితో 26 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]


[youtube_video videoid=MhMgS8MJJlk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 10 =