నాగార్జున ‘హ‌లోబ్ర‌ద‌ర్..’కి పాతికేళ్ళు

Nagarjuna Hello Brother Movie Completes 25 Years,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,25 Years For Hello Brother Movie,25 Years Completed For Hello Brother Movie,25 Years Turns For Nagarjuna Hello Brother Movie,Nagarjuna Hello Brother Movie Latest Updates,
Nagarjuna Hello Brother Movie Completes 25 Years

“హీరోలయందు మాస్ హీరోలు వేరయా” అన్నట్టుగా… ప్రతీ కథానాయకుడు మాస్ హీరో అనిపించుకోవాలని తాపత్రయపడతాడు. ఒక్కసారి మాస్ హీరోగా ప్రేక్షకుల ఆదరణ పొందితే… ఆ చిత్రం ప్రేక్షకులకు చేరువైతే… ఆ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన మ‌..మ‌.. మాస్‌ చిత్రమే కింగ్ నాగార్జున డ్యూయెల్ రోల్స్‌లో నటించిన ‘హలోబ్రదర్..’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి ముందు వరకు నాగ్ ఎన్నో మాస్ ఎంటర్‌టైనర్స్‌లలో నటించారు. కాని అసలు సిసలైన యాక్షన్ కామెడీ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు చేరువైన ఈ చిత్రం… నాగ్ కెరీర్‌కి ఎంతో స్పెషల్. ముఖ్యంగా ఈ సినిమాలో గోదావరి జిల్లాల యాసలో నాగ్ పలికిన సంభాష‌ణ‌లు అద్భుతః అన్నట్టుగా ఉంటాయి. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ఓ పక్క తనదైన మార్కు కామెడీ ట్రాక్‌తో అలరిస్తూనే… మరోపక్క యాక్షన్ సన్నివేశాలలో నాగ్‌ను ప్రెజెంట్ చేసిన వైనం… అభిమానులతో పాటు స‌గ‌టు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేసింది. యన్.టి.రామారావు-‘రాముడు భీముడు’, అనిల్ కపూర్-‘కిషన్ క‌న్‌హ‌య‌’(హిందీ మూవీ), జాకీ చాన్-ట్విన్ డ్రాగ‌న్స్’(చైనీస్ ఫిలిమ్) చిత్రాల ఆధారంగా… వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మించారు.

నాగ్ సరసన రమ్యకృష్ణ, సౌందర్య నాయికలుగా నటించిన ఈ సినిమాలో… కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం, అలీ, అన్నపూర్ణ, గిరిబాబు, బాబుమోహన్, శరత్ బాబు, శ్రీ‌హ‌రి, నెపోలియ‌న్‌ తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రల్లో నటించారు. రాజ్ – కోటి స్వరపరచిన పాటలన్నీ జనాదరణ పొందాయి. ముఖ్యంగా “ప్రియ రాగాలే” పాట క్లాస్‌ ట‌చ్ ఇస్తే… “మనసిచ్చి ఇచ్చి” పాట రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకుని వెళ్తుంది. ఇక క‌న్నెపిట్ట‌రో పాట అయితే ఊర మాస్ లెక్క‌లో సాగుతుంది. 1994 ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హలోబ్రదర్..’ నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

‘హలోబ్రదర్..’ – కొన్ని విశేషాలు:

  • నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్ర‌మిది. దేవా, ర‌వివ‌ర్మ‌… ఇలా రెండు పాత్ర‌ల్లోనూ చ‌క్క‌ని వెరియేష‌న్ చూపించారు. ఈ సినిమా తర్వాత నాగ్ ద్విపాత్రాభినయంలో వ‌చ్చిన‌ ‘ఎదురులేని మనిషి’ని మిన‌హాయిస్తే… ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సినిమాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి.
  • నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన మూడో చిత్రం ‘హలోబ్రదర్..’. అంతకు ముందు వీరిద్దరూ ‘సంకీర్తన’, ‘ఇద్ద‌రూ ఇద్దరే’ చిత్రాల్లో జంటగా అలరించారు. ‘హలోబ్రదర్..’ తర్వాత నాగ్, రమ్య కాంబినేషన్‌లో ‘క్రిమినల్’, ‘ఘరానా బుల్లోడు’, ‘అన్నమయ్య’, ‘చంద్రలేఖ’, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాలు వ‌చ్చాయి. అలాగే… వీటికంటే ముందు అల్ల‌రి అల్లుడులో నాగ్ ప‌క్క‌న ర‌మ్య ఓ ప్ర‌త్యేక గీతంలోనూ మురిపించింది.
  • నాగార్జున సరసన సౌందర్య నటించిన తొలి చిత్రమిదే. అనంతరం వీరిద్దరూ కలిసి ‘రాముడొచ్చాడు’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘ఆజాద్’, ‘ఎదురులేని మనిషి’, ‘అధిపతి’ చిత్రాల్లో జంట‌గా నటించారు. ‘హలోబ్రదర్..’ తర్వాత నాగార్జునతో కలిసి రమ్యకృష్ణ, సౌందర్య ఐదేసి సినిమాల్లో నటించడం గ‌మ‌నార్హం.
  • నాగ్ నటించిన తొలి డ్యూయెల్ రోల్స్‌ ఫిలిమ్ ‘హలోబ్రదర్..’లో హీరోయిన్స్‌గా నటించిన రమ్య, సౌందర్య… తర్వాత నాగ్ ద్విపాత్రాభినయం చేసిన ‘ఎదురులేని మనిషి’(సౌందర్య), ‘సోగ్గాడే చిన్ని నాయనా’(రమ్యకృష్ణ)చిత్రాల్లోనూ కథానాయికలుగా న‌టించ‌డం విశేషం.
  • ఈ సినిమాలోని “క‌న్నెపెట్ట‌రో కన్నుకొట్టరో” పాట కోసం నాగ్‌తో క‌లిసి రంభ‌, ఇంద్ర‌జ‌, ఆమ‌ని ఆడిపాడారు. వీరిలో రంభ త‌ప్ప మిగిలిన ఇద్ద‌రూ (ఆమ‌ని – ఘ‌రానా బుల్లోడు, ఇంద్ర‌జ – వ‌జ్రం) నాగ్‌తో మ‌ళ్ళీ జట్టుక‌ట్టారు.
  • ఈ సినిమాతో ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కులుగా నంది అవార్డును అందుకున్నారు రాజ్ – కోటి.
  • ఈ చిత్రం హిందీలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా డేవిడ్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జుడ్‌వా’ పేరుతోనూ… క‌న్న‌డ స్టార్ ర‌విచంద్ర‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ‘చెలువా’ పేరుతో క‌న్న‌డంలోనూ 1997లో రీమేక్ అయ్యింది. అంతేకాదు… 2017లో డేవిడ్ ధావ‌న్ త‌న త‌న‌యుడు వ‌రుణ్ ధావ‌న్ హీరోగా మరోసారి ‘జుడ్‌వా’ను రీమేక్ చేయ‌డం విశేషం.

[subscribe]


[youtube_video videoid=u7NnvsvLFyw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − four =