స్టైలిష్ డైరెక్ష(న్)ర్ కు 20 ఏళ్లు

20 Years For Stylish Director Puri Jagannadh In TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vote For Your Favourite Movie of Puri Jagannadh,The Best Movies of Stylish Director Puri Jagannadh,20 Years For Puri Jagannadh in Industry,Top 10 Movies of Puri Jagannadh
20 Years For Stylish Director Puri Jagannadh In TFI

 ఎనిమిది దశాబ్దాల పైబడిన తెలుగు సినిమా చరిత్రలో ఎందరెందరో దర్శక శ్రేష్టులు తెలుగు తెరను వెలుగుల మయం చేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. అయితే కొన్ని వేలమంది దర్శకులలో అతి కొద్ది మంది మాత్రమే తమదైన ముద్రను వేయగలిగారు. ప్రముఖ, ప్రసిద్ధ, సుప్రసిద్ధ వంటి విశేషణాలతో సంభోదించవలసినంతటి స్థాయికి అతి కొద్దిమంది మాత్రమే చేరుకున్నారు. ప్రముఖులుగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తమదైన ప్రగాఢ ముద్రను వేయగలిగే ” ట్రెండ్ సెట్టర్స్ “గా నిలిచిపోయేవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాంటి అరుదైన దర్శకులలో ఒక ప్రత్యేక తరహా “బ్రాండెడ్ స్టైలిష్ డైరెక్టర్” గా నిలిచిన  దర్శకుడు పూరి జగన్నాధ్. ప్రతి కథలోనూ, కదలికలోనూ తనదైన ప్రత్యేకత తరహా స్టయిల్ ను ఆవిష్కరించుకుంటూ జయాపజయాలకు అతీతమైన ఒక బ్రాండెడ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న  పూరి జగన్నాథ్ ఈరోజుతో టీనేజ్  పూర్తిచేసుకుని ఇరవయ్యవ పడిలోకి అడుగుపెడుతున్నారు. 

ఇదేమిటి పూరి కొడుకు “ఆకాష్ పూరి” వయసు గురించి రాయబోయి పొరపాటున పూరి జగన్నాధ్  వయసు 20 అని  రాసారు అనుకుంటున్నారా? అదేం కాదులెండి… ఈరోజుతో   పూరి జగన్నాథ్ దర్శకుడిగా 19 ఏళ్లు పూర్తి చేసుకుని 20 లోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆయన అసలు వయసును ప్రస్తావించకుండా దర్శకుడిగా ఆయన తొలి అడుగును గుర్తు చేసుకుందాం.

2000వ సంవత్సరం ఏప్రిల్ 20 న పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “బద్రి” విడుదలైంది. తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ రెండేళ్ల పాటు పూరి జగన్నాథ్ ప్రస్తావన, ప్రభావము పెద్దంతగా కనిపించలేదు. 2002లో విడుదలైన “ఇడియట్”  విజయంతో ప్రారంభమైన పూరి స్టయిల్ ఒక ప్రభంజనం అయింది.

టేకింగ్, మేకింగ్, రైటింగ్, టాకింగ్  – ఇలా ప్రతి అంశంలోనూ పూరి ముద్ర ప్రస్ఫుటమైంది. నిజానికి అద్భుత విజయాలు సాధించిన దర్శకులు ఎందరో ఉన్నప్పటికీ వారిలో 99% దర్శకులు రచయితల మీద ఆధారపడే దర్శకులే.  కానీ  పూరి జగన్నాధ్  అలా కాదు. “కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం- పూరి జగన్నాథ్” అనే టైటిల్ కార్డ్ తెర మీద నిండుగా కనిపిస్తుంది. శతాధిక చిత్ర దర్శకులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తరువాత అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ”ఓన్  ప్రొడక్షన్”  రన్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం మేకర్ పూరి జగన్నాథ్ అనే  చెప్పాలి.  అందుకే చిత్ర పరిశ్రమలో మీ వారసుడు ఎవరు అని అడిగితే “నా లాగానే అన్ని బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలిగిన పూరి జగన్నాథ్ నా వారసుడు” అని  కీర్తిశేషులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ప్రకటించటం విశేషం.

ఇప్పటివరకు  ఈ 19 ఏళ్ల కాలంలో ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో  ఉన్న “ఇస్మార్ట్ శంకర్” తో కలుపుకుని 34 చిత్రాలకు  దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ మొత్తం 37 చిత్రాలకు కథలను,33 చిత్రాలకు స్క్రీన్ ప్లే, 28 చిత్రాలకు డైలాగులు సమకూర్చి కాంటెంపరరీ డైరెక్టర్స్ లో ఎవరూ  సాధించని అరుదైన ఫీట్ సాధించి గొప్ప ట్రెండ్ సెట్టర్ అయ్యారు. అలాగే నిర్మాతల దర్శకుడిగా పేరున్న పూరి జగన్నాథ్ కు  నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, బడ్జెట్ కంట్రోల్ విషయంలో కూడా గొప్ప స్వీయ నియంత్రణ ఉంది.

దర్శక నిర్మాతగా, కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో అగ్రశ్రేణి దర్శకుడు గా వెలుగొందుతున్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటికి 33 చిత్రాలు రాగా వాటిలో 12 చిత్రాలను ఎంపిక చేసి వాటిలో “ది బెస్ట్ ఆఫ్ పూరి” ఏదో సెలెక్ట్ చేసే ఒక సరదా పోల్ గేమ్ ను మీ ముందుకు తెస్తుంది మీ”  ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”. సో…. దర్శకుడిగా19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 వ వసంతంలోకి అడుగిడుతున్న పూరి జగన్నాథ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ  ” ద బెస్ట్ ఆఫ్ పూరి” ని సెలెక్ట్  చేయండి.

ది బెస్ట్ ఆఫ్ "పూరి" ఏది?

[subscribe]

[youtube_video videoid=hKDnz0e6338]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 17 =