వార‌సుల‌ పేర్ల‌తో… తండ్రుల స్క్రీన్ నేమ్స్…

Will This New Sentiment Work For Nani?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani sentiment Work Out for Jersey Movie,Jersey Movie Latest Updates,Son's Name Sentiment Work For Nani New Movie,Nani New Movie News
Will This New Sentiment Work For Nani?

“ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాక నన్ను జడ్జ్ చేయంది నా కొడుకు ఒక్కడే… వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను”… ఇది ‘జెర్సీ’ సినిమాలో డైలాగ్. అవడానికి సినిమా డైలాగే అయినా నూటికి నూరు పాళ్ళు ప్రతీ తండ్రి మనసులో ఉండే మాటే ఇది. అందుకే ప్రతీ తండ్రి త‌ను సాధించిన ప్ర‌తీ విజయంలోనూ కొడుకుని కూడా భాగస్వామిని చేస్తాడు. ఈ విషయంలో సినీ తారలు ఏమాత్రం మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో వారి స్టార్‌డమ్‌ను త‌మ త‌న‌యుల‌కు ప‌రోక్షంగా ఆపాదించ‌డానికి ప్ర‌య‌త్నించారు, ప్ర‌య‌త్నిస్తున్నారు. అదెలాగంటే… త‌మ వార‌సుల పేర్ల‌ను స్క్రీన్ నేమ్స్‌గా చేసుకుని కొంత‌మంది ప్ర‌ముఖ క‌థానాయ‌కులు తెర‌పై సంద‌డి చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ముందుగా చెప్పుకోవలసింది మహానటుడు నందమూరి తారకరామారావు గురించి… ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో త‌న తనయుడు రామకృష్ణ పేరుతో దర్శనమిస్తారు య‌న్టీఆర్. ఆ తర్వాత కాలంలో ఆ పరంపరను మెగాస్టార్‌ చిరంజీవి (‘కిరాతకుడు’లో – చరణ్‌గా), కింగ్ నాగార్జున (‘చైతన్య’లో – చైతన్యగా, ‘సూపర్’లో – అఖిల్‌గా) కొనసాగించారు. ఇక ఇప్పటి స్టార్ హీరోల విషయానికొస్తే… ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరా నందన్ పేరు నుంచి నంద తీసుకుని ‘అత్తారింటికి దారేది’ సినిమాలో గౌత‌మ్ నందగా అల‌రించాడు. అలాగే సూప‌ర్ స్టార్ మహేష్ బాబు తన తనయుడు గౌతమ్ పేరుతో ‘1 నేనొక్కడినే’లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ వ‌రుస‌లోనే ఇప్పుడు నేచురల్ స్టార్‌ నాని కూడా చేరిపోయాడు. త‌న విషయానికొస్తే… ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘జెర్సీ’లో అర్జున్ (నాని కొడుకు పేరు)గా కనిపించనున్నాడు నాని. జయాపజయాల విషయాలు పక్కన పెడితే… కొడుకు పేర్లను స్క్రీన్ నేమ్స్‌గా పెట్టుకుని మ‌న స్టార్ హీరోలు మురిపించారు. మరి అర్జున్‌గా ‘జెర్సీ’లో దర్శనమివ్వబోతున్న నాని ఎటువంటి ఫ‌లితాన్ని అందుకోనున్నాడో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=aC0lLhI39Io]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + two =