మొన్నటి వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరోసారి మరో సంచలనానికి తెర తీశాడు. ఇటీవల జరిగిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇంటర్వ్యూల్లో కేసీఆర్ పై సినిమా తీస్తానని చెప్పినట్టుగానే వర్మ అప్పుడే సినిమా టైటిల్ ను కూడా ప్రకటించేశాడు. ‘కేసీఆర్ టైగర్.. ది అగ్రెసివ్ గాంధీ’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినట్లు వర్మ ట్విట్టర్ లో తెలిపారు. ఈ టైటిల్ కు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే లైన్ ను జతచేశారు. కాగా, ఈ సినిమాలో నటీనటుల గురించి త్వరలోనే వర్మ మరిన్ని విషయాలను వెల్లడించే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా తాను దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఏపీలో మాత్రం ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ.. సినిమా రిలీజ్ ను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఏపీలో సినిమా రిలీజ్ కు అడ్డుకట్ట పడింది. మరి ఎన్నికలు అయిపోయాయి… ఇప్పుడైనా ఏపీలో ఈ సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుందేమో చూద్దాం..
మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకే ఇంత రచ్చ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ సినిమాకు ఎంత రచ్చ జరుగుతుందో.. ఈ సినిమా రిలీజ్ కు ఎన్ని సమస్యలు వస్తాయో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=x9Nosano2ng]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: