‘మజిలీ’, ‘చిత్రలహరి’, ‘జెర్సీ’… ప్ర‌తీ వారం అల‌రిస్తున్న తండ్రీకొడుకుల అనుబంధం

Majili And Chitralahari Movie Sentiment To Work For Jersey Also?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Father Sentiment Work For Jersey Movie,Is Majili And Chitralahari Movie Sentiment Work For Jersey,Chitarlahari and Majili on Track With Jersey,Jersey Movie Follows Majili And Chitralahari Sentiment
Majili And Chitralahari Movie Sentiment To Work For Jersey Also?

జీవితంలో ఒక్కసారి కింద‌ పడి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే… అటువంటి జీవితంలో చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. అంతేకాదు అటువంటి జీవితం నలుగురికి ఆదర్శం అవుతుంది. సరిగ్గా అటువంటి లూజర్స్ టు విన్న‌ర్స్‌ కాన్సెప్ట్‌తో తయారైన చిత్రాలే ‘మజిలీ’, ‘చిత్రలహరి’, ‘జెర్సీ’. ఏప్రిల్ 5న విడుదలైన ‘మజిలీ’, ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘చిత్రలహరి’లో ఈ కాన్సెప్ట్ బాగా వ‌ర్కవుట్ అయి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. అంతేకాదు… ఇదే ఛాయ‌లతో ఈ శుక్ర‌వారం విడుద‌ల కానున్న‌ ‘జెర్సీ’కూడా తెర‌కెక్కింద‌న్న‌ది ట్రైల‌ర్‌ని బ‌ట్టి ఇట్టే అర్థ‌మ‌వుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ మూడు సినిమాలకు సంబంధించి మరో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే… ఈ మూడు చిత్రాల్లోనూ తండ్రీకొడుకుల అనుబంధం కీల‌కమైన అంశం. “చిన్నప్పుడు నువ్వు నడవలేక పడిపోతుంటే పట్టుకున్నా… ఇప్పుడు తాగొచ్చి నడవలేక పడిపోతుంటే పట్టుకుంటున్నా… తండ్రిని కదా. నువ్వు పడిపోతున్న ప్రతీసారి పట్టుకుంటూనే ఉంటా” అంటూ ‘మజిలీ’ చిత్రంలో రావు రమేష్ చెప్పే డైలాగ్ ఆ తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే… తనొక ఫెయిల్యూర్‌నని ఫీలయ్యే కొడుకుని అన్నివేళలా పాజిటివ్ వైపుకు నడిపించే తండ్రి (పోసాని కృష్ణ‌ముర‌ళి) పాత్రతో సాగే చిత్రం ‘చిత్రలహరి’. ఇక ‘జెర్సీ’ విష‌యానికొస్తే… ట్రైల‌ర్‌లో చూపించిన దాన్ని బ‌ట్టి… కొడుకు దృష్టిలో ఎపుడూ ఉన్నంతంగానే ఉండాలి అనుకునే తండ్రి క‌థ ఇది. అలాగే ఆ తండ్రీకొడుకుల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌తో ఇది కూడా ఓ ఫాద‌ర్ సెంటిమెంట్ మూవీ అని అర్థ‌మ‌వుతోంది. మ‌రి పై రెండు చిత్రాల్లాగే ఈ నెల 19న విడుదల కానున్న ‘జెర్సీ’లో కూడా తండ్రీకొడుకుల అనుబంధం వ‌ర్కవుట్ అయి… మ‌రో స‌మ్మ‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ద‌క్కుతుందేమో చూద్దాం…

[subscribe]


[youtube_video videoid=EOw-oU_HNVA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =