పాట చిత్రీక‌ర‌ణలో`96`రీమేక్‌

Sharwanand and Samantha 96 Telugu Remake Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,96 Telugu Remake Movie Latest Updates,96 Telugu Remake Movie Songs,Sharwanand and Samantha New Movie News,Sharwanand 96 Movie Remake Details
Sharwanand and Samantha 96 Telugu Remake Latest Update

త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్96ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ వెర్ష‌న్‌లో విజ‌య్ సేతుప‌తి పోషించిన పాత్ర‌ని తెలుగులో శ‌ర్వానంద్ చేస్తుండ‌గా… త్రిష న‌టించిన పాత్ర‌లో స‌మంత ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్ కుమార్‌… తెలుగు వెర్ష‌న్‌కి కూడా ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా96రీమేక్ తాలూకు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాగా… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం మారిష‌స్‌లో ఓ పాటకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. బుధ‌వారంతో ఈ సాంగ్ షూటింగ్ పూర్తవుతుందని స‌మాచారం. ఆ వెంట‌నే చిత్ర బృందం కెన్యాకు బ‌య‌లుదేర‌నుంది. అక్క‌డ 12 రోజుల పాటు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారని తెలుస్తోంది.ఇంకా పేరు నిర్ణ‌యించ‌ని ఈ చిత్రాన్ని… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

[subscribe]


[youtube_video videoid=IrfmK-Tmmto]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 7 =