డీసెంట్ ఫాదర్ క్యారెక్టర్స్ లో పోసాని సక్సస్

Posani Gets Back To Back Success With Majili and Chitralahari,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Posani Back to Back Success Movies,Actor Posani About His Success With Majili and Chitralahari,Posani Krishna Murali Next Film Updates,Posani Success With Father Roles in Majili and Chitralahari Movies
Posani Gets Back To Back Success With Majili and Chitralahari

ఒక పర్టిక్యులర్ ఇమేజ్ కి బ్రాండ్ అయిన నటుడికి ఆ బ్రాండ్ కు  భిన్నమైన క్యారెక్టర్స్ రావటం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా సక్సెస్ అవడం ఇంకా అరుదు. కానీ కేవలం ఒక్క వారం గ్యాప్ లో రెండు సార్లు ఈ అరుదైన ఫీట్ సాధించి శభాష్ అనిపించుకున్నారు పోసాని కృష్ణ మురళి. ఒక రచయితగా తన కెరీర్ ప్రారంభించి అనుకోకుండా నటుడిగా మారి కమెడియన్ గా, విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా వైడ్ వెరైటీ అఫ్ క్యారెక్టర్స్ చేస్తున్న పోసాని కృష్ణ మురళికి ఈ మధ్యకాలంలో వరుసగా రెండు మంచి క్యారెక్టర్స్ చేసే  అవకాశం లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివ నిర్వాణ దర్శకత్వంలో “మజిలీ” చిత్రంలో పోసాని పోషించిన హీరోయిన్ ఫాదర్ కేరెక్టర్ కు చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సమంత లాంటి టాప్ హీరోయిన్ కు తండ్రిగా నటించడంతో పాటు  కూతురి కాపురం కోసం పరితపించే ఒక సగటు తండ్రి పాత్రను చాలా చక్కగా పోషించాడు కృష్ణ మురళి. తండ్రి కళ్ళలో ఆందోళన, పాత్ర తీరులో హాస్యం కలగలిసిన ఒక టిపికల్ ఫాదర్ కారెక్టర్ ను దర్శకుడు శివ నిర్వాణ రూపొందించగా ఆ పాత్రలో తనదైన శైలిలో నవ్వులు పూయించారు పోసాని.

ఇలా ఏప్రిల్ 5న విడుదలైన మజిలీలో హీరోయిన్ తండ్రి పాత్రలో అలరించిన పోసాని కృష్ణ మురళి ఏప్రిల్ 12న విడుదలైన “చిత్రలహరి” లో హీరో సాయి తేజ్ తండ్రిగా మరొక టిపికల్ క్యారెక్టర్ లో మెప్పించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోపోసాని పోషించిన పాత్ర కు గొప్ప అప్లాజ్ వచ్చింది.సమాజంలోని ప్రతి ఇంట్లో కనిపించే తండ్రీ కొడుకుల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన సాయి ధరమ్ తేజ్ – పోసాని పాత్రలకు మంచి ఐడెంటిటీ లభించింది. “మా నాన్న ఇలా ఉండాలి” అని ప్రతి కొడుకు అనుకునేలా కొడుకు మనస్తత్వాన్ని , అతని బాధను అర్థం చేసుకునే సగటు తండ్రి పాత్రలో పోసాని నటన ప్రశంసనీయంగా ఉంది.


“లవ్ యు రాజా” అంటూ కామెడీ విలన్ గా నాన్ సీరియస్ క్యారెక్టర్స్ చేసే పోసాని కృష్ణ మురళికి వెంటవెంటనే రెండు మంచి పాత్రలు లభించటంతో అతని ఇమేజ్ లో చాలా చేంజ్ వచ్చింది. పాష్ అండ్ సోఫిస్టికేటెడ్ ఫాదర్ క్యారెక్టర్స్ చేయాలి అంటే కేరళ, తమిళనాడు నుండి ఆర్టిస్టులను దిగుమతి చేసుకోవాలి అనే మైండ్ సెట్ లో ఉండే మన దర్శకులు మన వాళ్లలోనే మంచి ఆర్టిస్టులను ఐడెంటిఫై చేసుకోవచ్చు అనటానికి పోసాని చేసిన ఈ రెండు పాత్రలను ఉదాహరణగా తీసుకోవచ్చు. మొత్తానికి ఒక వారం గ్యాప్ లో రెండు విశిష్ట పాత్రలను పోషించి మెప్పించిన పోసానికి , ఆ పాత్రలను మన తెలుగు వాళ్లతోనే చేయించాలి అనుకున్న దర్శకులు శివ నిర్వాణ, కిషోర్ తిరుమలకు అభినందనలు.

[subscribe]


[youtube_video videoid=vpXkK0pgm8o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 2 =