కాంచన3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లారెన్స్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ముని సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆతరువాత ఆ సినిమా సీక్వెల్ లో కాంచన, గంగ సినిమాలు తెరకెక్కించగా.. అవి కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆ సీక్వెల్ లో భాగంగానే కాంచన 3 అనే సినిమాను తెరకెక్కించాడు లారెన్స్. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్ర యూనిట్.

దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు చేశారు. రేపు అంటే ఏప్రిల్ 17న సాయంత్రం 6 గంటల నుంచి, హైదరాబాద్ – దసపల్లా కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

కాగా ఈ సినిమాలో లారెన్స్ సరసన ఓవియా, వేదిక హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. తెలుగులో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు రిలీజ్ చేయనున్నాడు. తమిళం తోపాటు తెలుగులో మే1 వ తేదీన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే లారెన్స్ డిఫరెంట్ లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి. మరి ఈ సినిమా ఆ సినిమాల రేంజ్ లో ఉంటుందా?లేదా? అన్న విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=s01YohDdGZE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − sixteen =