బ‌న్నీ, త్రివిక్ర‌మ్ చిత్రానికి టైటిల్ మారుతోందా?

Allu Arjun and Trivikram Movie Title to Change?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram Next Film Updates,Allu Arjun Upcoming Movie Title,Same Sentiment Work Out For Trivikram New Movie Title,Trivikram Sentiment For Allu Arjun New Movie
Allu Arjun and Trivikram Movie Title to Change?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన ఈ చిత్రం తాలూకు రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానుంది. బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్న ఈ సినిమాలో ట‌బు, స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇత‌ర ముఖ్య భూమిక‌ల్లో న‌టిస్తున్నారు. కాగా… ఈ సినిమాకి తొలుత నాన్న నేను అనే టైటిల్ వినిపించిన సంగ‌తి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే… తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి అల‌క‌నంద‌ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ని టాక్‌. బ‌న్నీకి అమ్మ‌గా న‌టిస్తున్న ట‌బు పాత్ర పేరు ఇద‌ని… సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే… అల‌క‌నంద‌ని ఫిక్స్ చేశాడ‌ట త్రివిక్ర‌మ్‌. అంతేకాదు… త్రివిక్ర‌మ్ చిత్రాల టైటిల్స్ అన్నీ కూడా స్టార్స్ ఇమేజ్‌ల మీద కాకుండా… క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటాయి. అలా… సెంటిమెంట్‌తోనే ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నుంచి ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. అత‌డు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాత‌వాసి, అర‌వింద స‌మేత‌… ఇలా ఇప్ప‌టికే ఐదు సార్లు ప్ర‌థ‌మాక్ష‌రంగా త్రివిక్ర‌మ్‌ చిత్రాల పేర్లు వ‌చ్చాయి. మ‌రి… అల‌క‌నంద‌ టైటిల్‌లో ఎంత వాస్త‌వ‌ముందో త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]


[youtube_video videoid=Y_sUze-_TZI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 1 =