‘వెంకీ మామ’లో ఆ సీన్ హైలైట్ అవుతుంద‌ట‌

Venkatesh To Entertain Audience With His Comedy Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Latest Updates,Venkatesh To Play Comedy Again in His Upcoming Movie,Venky Mama Telugu Movie Latest News,Same Sentiment For Venkatesh in Venky Mama Movie
Venkatesh To Entertain Audience With His Comedy Again

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ఎఫ్‌-2’తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్వించాడు విక్ట‌రీ వెంక‌టేష్. ప్ర‌స్తుతం… ఈ సీనియ‌ర్ హీరో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్ర‌మే వెంకీ మామ‌. ఈ సినిమా కోసం త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి వినోదాలు పంచ‌నున్నాడు వెంకీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం… ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కాగా… ఈ సినిమాలో వెంక‌టేష్ రైస్‌ మిల్ ఓన‌ర్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట‌. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే ఈ పాత్ర ఆద్యంతం వినోద‌భ‌రితంగా ఉంటుంద‌ని స‌మాచారం.

ముఖ్యంగా.. పెళ్ళి చూపుల దృశ్యంలో వెంకీ త‌న మార్కు కామెడీతో మ‌రోసారి న‌వ్వించ‌బోతున్నాడ‌నీ… ఈ స‌న్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంద‌ని టాక్‌. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్న వెంకీ మామ‌… విజ‌య ద‌శ‌మి కానుక‌గా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]


[youtube_video videoid=bJAKvOx_UE4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =