నాగ్ సీక్వెల్స్‌లో కుటుంబ స‌భ్యులు

Samantha and Naga Chaitanya To Play Important Roles In Nagarjuna Sequel Movies?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Upcoming Sequel Movie News,ChaySam To Play Crucial Roles in Nagarjuna Sequel Movies,Nagarjuna New Movie News,Nagarjuna Next Film Details
Samantha and Naga Chaitanya To Play Important Roles In Nagarjuna Sequel Movies?

సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌ళ్ళీ తెలుగు చిత్రాల‌పై దృష్టి పెట్టాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ప్ర‌స్తుతం నాగ్ న‌టిస్తున్న రెండు తెలుగు చిత్రాలు కూడా త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌కి సీక్వెల్స్ కావ‌డం విశేషం. ఆ సీక్వెల్సే… మ‌న్మ‌థుడు 2, బంగార్రాజు. అంతేకాదు… ఈ రెండు సినిమాల‌నూ త‌నే స్వ‌యంగా నిర్మించ‌డ‌మే కాకుండా… ఈ చిత్రాల్లో కుటుంబ స‌భ్యుల‌కు కూడా చోటిచ్చాడు నాగ్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ‘మ‌న్మ‌థుడు’కి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం ‘మ‌న్మ‌థుడు 2’. రాహుల్ ర‌వీంద్ర‌న్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో నాగ్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా… నాగ్ కోడ‌లు, న‌టి స‌మంత ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా… ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి కానుంది.

కాగా… జూలై నుంచి ప‌ట్టాలెక్క‌నున్న సోగ్గాడే చిన్ని నాయ‌నా సీక్వెల్ బంగార్రాజుకి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా… ఇందులో నాగ్ త‌న‌యుడు, యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య ఓ ముఖ్య భూమిక పోషించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి… కుటుంబ స‌భ్యుల‌తో నాగ్ న‌టిస్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్‌ సీక్వెల్స్ ఏ మేరకు అల‌రిస్తాయో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=j7B34XDQ3Bo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − six =