`ఐకాన్‌`లో అల్లు అర్జున్ ద్విపాత్రాభిన‌యం?

Allu Arjun To Play Dual Role,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun To Act Double Role in His Next Film,Stylish Star Allu Arjun Upcoming Movie Role,Allu Arjun New Movie News,Allu Arjun To Play Different Roles in His Upcoming Film
Allu Arjun To Play Dual Role

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం ‘ఐకాన్’. క‌న‌బడుట లేదు అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాని నిర్మించ‌నున్నాడు. ఆర్య‌, ప‌రుగు, ఎవ‌డు, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ త‌రువాత బ‌న్నీ – రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్నచిత్ర‌మిది. కాగా… బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల చేసిన ఐకాన్‌ ప్రీ లుక్‌ పోస్ట‌ర్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… ఈ సినిమాలో బ‌న్నీ తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ బ‌న్నీ ఎన‌ర్జీకి స‌రిప‌డేట్టు ఈ డ్యూయెల్ రోల్స్‌ని మ‌లిచాడ‌నీ… సినిమాలో ఇదే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచే అంశ‌మ‌ని టాలీవుడ్ టాక్‌. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలోనూ అల్లు అర్జున్ డ‌బుల్ రోల్ చేసిన సంద‌ర్భం లేదు… కాబ‌ట్టి ఈ చిత్రానికి అదే యు.ఎస్‌.పి (యూనిక్ సెల్లింగ్ పాయింట్‌) అవుతుంద‌ని ఇన్ సైడ్ సోర్స్ టాక్‌. అంతేకాదు… ఈ సినిమాలో బ‌న్నీకి జంట‌గా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్‌ని న‌టింప‌జేసే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉందని స‌మాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించి… 2020 ద‌స‌రాకి సినిమాని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. త్వ‌ర‌లోనే బన్నీ ద్విపాత్రాభిన‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]


[youtube_video videoid=Qv3TWVaXcRc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =