ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌ల్లో బ‌న్నీ

Allu Arjun To Play Completely Different Roles In His Upcoming Films,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Stylish Star Allu Arjun Upcoming Movie Role,Allu Arjun New Movie News,Allu Arjun To Play Various Roles in His Next Film,Allu Arjun Next Project Updates
Allu Arjun To Play Completely Different Roles In His Upcoming Films

గత ఏడాది వేస‌వికి విడుద‌లైన‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… వ‌రుసగా మూడు ప్రాజెక్ట్‌ల‌ను అంగీకరించిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్‌, సుకుమార్,ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ కాంబినేష‌న్‌లో ఈ సినిమాలు చేస్తున్నాడు బ‌న్నీ. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ స‌త్య‌మూర్తి’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్న విష‌యం విదిత‌మే. తాజాగా పూజా కార్యక్ర‌మాల‌ను కూడా జ‌రుపుకున్న‌ ఈ సినిమా… ఏప్రిల్ 24 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫాద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి నాన్న నేను అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. తండ్రీకొడుకుల మ‌ధ్య సాగే భావోద్వేగ‌భ‌రిత క‌థ‌తో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి… సుకుమార్ డైరెక్ష‌న్‌లో త‌న త‌దుప‌రి సినిమా చేయ‌నున్నాడు బ‌న్నీ. ఎర్ర‌ చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో బ‌న్నీ స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని టాక్. అంతేకాదు… బ‌న్నీ – సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య 2 కంప్లీట్ ల‌వ్ స్టోరీస్ కాగా…. ఈ చిత్రంలోనూ కొత్త త‌ర‌హా ప్రేమ స‌న్నివేశాల‌కు చోటుంటుంద‌ని టాక్‌.

ఇక‌ వేణు శ్రీ‌రామ్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న ఐకాన్‌ విష‌యానికి వ‌స్తే… జీవితాన్ని శోధించే ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఉంటుంద‌ని స‌మాచారం. త్రివిక్ర‌మ్‌, సుకుమార్ సినిమాలు పూర్తైన త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశ‌ముంది. మొత్తానికి ఏడాది గ్యాప్ తీసుకున్నా… మూడు వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థాంశాల‌తో కూడిన చిత్రాల‌ను, పాత్ర‌ల‌ను ఎంచుకుని… అటు అభిమానుల‌ను, ఇటు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి బ‌న్నీ సిద్ధ‌మ‌వుతున్నాడ‌న్న మాట‌.

[subscribe]


[youtube_video videoid=lS5CrgkciTo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 2 =