‘బంగార్రాజు’ అప్‌డేట్స్‌

Soggade Chinni Nayana 2 Confirmed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya Fixed For Soggade Chinni Nayana 2,Nagarjuna Ready For Soggade Chinni Nayana Sequel,Soggade Chinni Nayana 2 Movie Latest Updates,Soggade Chinni Nayana 2 Movie Details Revealed,Soggade Chinni Nayana 2 On The Cards
Soggade Chinni Nayana 2 Confirmed

ప్ర‌స్తుతం ‘మ‌న్మ‌థుడు 2’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు కింగ్ నాగార్జున. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే… క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్వ‌క‌త్వంలో ‘బంగార్రాజు’ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసాడు నాగ్‌. గతంలో వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’కు సీక్వెల్‌గా ఈ ‘బంగార్రాజు’ తెర‌కెక్క‌బోతోంది. కాగా… ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన‌ పూర్వ నిర్మాణ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… జూలై నుంచి ప‌ట్టాలెక్క‌బోయే ఈ సినిమాలో యువ క‌థానాయ‌కుడు నాగ చైత‌న్య ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇదే విష‌యాన్ని నాగ చైత‌న్య కూడా ఓ ఇంట‌ర్వ్యూలో ధృవీక‌రించాడు. అంతేకాదు… ప్ర‌స్తుతం క‌థానాయిక‌ల అన్వేష‌ణ సాగుతోంద‌ని తెలియ‌జేశాడు. మొత్తానికి… నాగ్‌, చైతూ మ‌ళ్ళీ క‌ల‌సి న‌టించ‌నుండ‌డం అక్కినేని అభిమానుల‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మే. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]


[youtube_video videoid=l2KmkThwcic]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 5 =