‘మ‌హ‌ర్షి’లో ఎనిమిది పాట‌లు?

Maharshi Soundtrack Number Revealed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Latest Updates,Mahesh Babu Maharshi Has 8 Soundtracks,Maharshi Movie Song,Maharshi Soundtrack List Unveiled,Latest Updates About Maharshi Songs
Maharshi Soundtrack Number Revealed

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ సినిమా ‘మ‌హ‌ర్షి’. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తున్న‌ ఈ చిత్రంలో `అల్ల‌రి` న‌రేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మ‌హేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా… ఈ సినిమాకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే విడుద‌ల చేసిన‌ ఫస్ట్ సింగిల్‌ “చోటీ చోటీ బాతే”… మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు శ్రోత‌ల‌ను కూడా విశేషంగా అల‌రిస్తోంది.

అలాగే సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్ తాలూకు `స‌క్సెస్‌`ఫుల్ జ‌ర్నీని ఎలివేట్ చేస్తూ తాజాగా విడుద‌ల చేసిన సెకండ్ సింగిల్‌ “నువ్వే స‌మ‌స్తం” కి కూడా మంచి బాణీని అందించాడు దేవిశ్రీ‌. అయితే… ఈ పాట స‌న్నివేశాల్లో భాగంగా అక్క‌డ‌క్క‌డ బ్యాగ్రౌండ్ సాంగ్‌గా వ‌స్తుంద‌ని స‌మాచారం. ఈ పాట‌తో పాటు మ‌రో పాట కూడా ఆర్‌.ఆర్‌గా సినిమాలో వస్తుందని స‌మాచారం. ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని పాట‌ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

అదేమిటంటే… ఈ సినిమాలో మొత్తంగా ఎనిమిది పాట‌లు ఉంటాయ‌ట‌. వాటిలో ఆరు స్ట్ర‌యిట్ సాంగ్స్ కాగా… రెండు ఆర్‌.ఆర్ త‌ర‌హా గీతాలు అని టాక్‌. మ‌రి… ఇందులో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. ఎందుకంటే… ఈ నెలాఖ‌రులో `మ‌హ‌ర్షి` నుంచి ఫుల్ ఆల్బ‌మ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. సి.అశ్వ‌నీద‌త్‌, `దిల్‌` రాజు, ప్ర‌సాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న `మ‌హ‌ర్షి` మే 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here