15 ఏళ్ళ త‌రువాత `మాస్‌` జోడీ?

Nagarjuna and Jyothika to Work Together Again?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna and Jyothika Combo is Back,Nagarjuna and Jyothika To Team Up Once Again,Nagarjuna and Jyothika To Hit the Screen Once Again,Nagarjuna and Jyothika Roped For Next Project,Jyothika To Pair Up With Nagarjuna For Her New Movie
Nagarjuna and Jyothika to Work Together Again?

కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ (2016) బాక్సాఫీస్ వ‌ద్ద‌ కాసుల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. సోషియో ఫాంట‌సీ మూవీగా తెర‌కెక్కిన ఆ సినిమాలో బంగార్రాజుగా నాగార్జున చేసిన సంద‌డి ఇంతా అంతా కాదు. ఇప్పుడు అదే పాత్ర పేరుతో ఆ సినిమా సీక్వెల్‌కి స్క్రిప్ట్ వ‌ర్క్ రెడీ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌. మ‌రోవైపు ‘బంగార్రాజు’ సినిమా పూర్వ‌నిర్మాణ పనుల్లో భాగంగా ఆర్టిస్టుల ఎంపిక‌ను కూడా ప్రారంభించాడు ద‌ర్శ‌కుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలిభాగంలో బంగార్రాజుకు జోడీగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ… రెండో భాగంలో కూడా అదే పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుందని టాక్‌. ఇక‌పోతే ఫస్ట్ పార్ట్‌లో రాము (నాగార్జున – బంగార్రాజు కొడుకు)కు జంట‌గా న‌టించిన లావ‌ణ్య త్రిపాఠి స్థానంలో కోలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ను ఎంపిక చేసిన‌ట్లు ఆ మ‌ధ్య కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే త‌న కాల్షీట్స్ ని అడ్జ‌స్ట్ చేయ‌లేని కార‌ణంగా… న‌య‌న్ ఈ ప్రాజెక్ట్ ని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ని స‌మాచారం. ఇప్పుడు ఆ స్థానంలో మ‌రో టాలెంటెడ్ హీరోయిన్ జ్యోతికను ఎంపిక చేసే దిశ‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే… 15 ఏళ్ళ క్రితం నాగ్, జ్యోతిక క‌ల‌యిక‌లో ‘మాస్’ (2004) అనే బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ వ‌చ్చింది. ఆ త‌రువాత‌… శ్రీ‌రామ‌దాసు కోసం జ్యోతిక పేరు ప‌రిశీలించినా… కొన్ని కార‌ణాల వ‌ల్ల అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఈ నేప‌థ్యంలో… బంగార్రాజు విష‌యంలో జ్యోతిక పేరు వినిపించ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. మ‌రి… మాస్‌ మ్యాజిక్ మ‌రోసారి రిపీట్ అవుతుందేమో చూడాలి. కాగా… త్వ‌ర‌లోనే జ్యోతిక ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]


[youtube_video videoid=l2KmkThwcic]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 10 =