‘వెంకీ మామ’తో చైతు ఆ విష‌యంలో హ్యాట్రిక్ కొడతాడా?

Naga Chaitanya Hits a hattrick With Venky Mama,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya New Movie Updates,Naga Chaitanya Venky Mama Movie Latest News,Venky Mama Telugu Movie Latest News,Naga Chaitanya Third Sentiment Work Out With Venky Mama Movie
Naga Chaitanya Hits a hattrick With Venky Mama

అక్కినేని నాగ చైతన్య… ‘జోష్’ సినిమాతో అక్కినేని వారసుడిగా వెండి తెరకు పరిచయమైనా… అన‌తి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటివ‌ర‌కు 17 సినిమాల్లో హీరోగా నటించగా… ‘ఏ మాయ చేసావే’, ‘100% లవ్’, ‘తడాఖా’, ‘మనం’ ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’… తాజాగా‘మజిలీ’తో ఘ‌న విజ‌యాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ప్రస్తుతం తన రియల్ లైఫ్ మేనమామ, సీనియర్ హీరో విక్ట‌రీ వెంకటేష్ తో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ మూవీలో చైతు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే… మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించ‌డం చైతూకి ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ఇలా రెండు సినిమాల్లో న‌టించి విజ‌యాలు అందుకున్న దాఖ‌లాలు ఉన్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే… చైతు త‌న కెరీర్ లో తొలిసారిగా న‌టించిన‌ మల్టీస్టారర్ మూవీ ‘తడాఖా’. ఇందులో సునీల్‌తో క‌ల‌సి నటించ‌గా… స‌ద‌రు చిత్రం మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ మూవీ అయిన ‘మనం’లో తన తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునతో కలిసి న‌టించి… రెండోసారి మల్టీస్టారర్ మూవీలో భాగస్వామి అయ్యాడు ఈ అక్కినేని వారసుడు. ఈ సినిమా కూడా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో… వెంకటేష్ తో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’ ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మరి రెండుసార్లు చైతుకి విజయాలను అందించిన మల్టీస్టారర్ మూవీ ఫార్ములా… మూడోసారి కూడా కలిసొచ్చి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.



Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here