నానితో ‘మలుపు’ డైరెక్టర్?

Malupu Director to Work Alongside Nani,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Next With Malupu Director,Natural Star Nani New Movie With Director Sathya Prabhas,Nani Next Project Details,Nani New Movie Updates
Malupu Director to Work Alongside Nani

ఆ మ‌ధ్య డబుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌తో అల‌రించిన నేచుర‌ల్ స్టార్‌ నాని… గత ఏడాది మాత్రం ఆశించిన విజ‌యాల‌ను అందుకోలేక‌పోయాడు. ఈ నేప‌థ్యంలో… వైవిధ్యభరితమైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు… తొమ్మిది నెల‌ల గ్యాప్‌లో ముచ్చ‌ట‌గా మూడు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు నాని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మళ్ళీ రావా’ ఫేమ్‌ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ఈ నెల 19న రిలీజ్ కానుండ‌గా… విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ ఆగస్టులో విడుద‌ల‌ కానుంది. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తున్న ‘వ్యూహం’ (ప్ర‌చారంలో ఉన్న పేరు) డిసెంబ‌ర్‌లో తెరపైకి రానుంది.

ఇదిలా ఉంటే… ఈ మూడు వైవిధ్యభరితమైన చిత్రాలతో పాటు మ‌లుపు ఫేమ్ సత్య ప్ర‌భాస్‌ పినిశెట్టి కాంబినేష‌న్‌లోనూ ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ చేయ‌డానికి నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మించే అవ‌కాశ‌ముందని టాలీవుడ్ టాక్‌. మరి… ‘నిన్నుకోరి’ సినిమాలో ఆది పినిశెట్టితో స్క్రీన్ షేర్ చేసుకుని విజయం సాధించిన నాని… ఇప్పుడు ఆది అన్న సత్య ప్ర‌భాస్ పినిశెట్టి డైరెక్షన్ లో సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=EOw-oU_HNVA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =