హీరోలకు కెరీర్ బెస్ట్ ఇస్తున్న సమంత

Samantha Carrier Best Films,Samantha is a Lucky Charm to Tollywood Heroes,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tollywood Heros are Lucky To Act With Samantha,Samantha Gives Best Carrier To Tollywood Heroes,Actress Samantha is a Lucky For Telugu Heroes
Samantha is a lucky charm to Tollywood heroes

సమంత… టాలీవుడ్ లో దాదాపు దశాబ్ద కాలంగా ఏడాదికో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. గత ఏడాది ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’ లాంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ చెన్నై బ్యూటీ… పెళ్లి తర్వాత తొలిసారి భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’తో ఈ ఏడాది తొలి తెలుగు విజయాన్ని అందుకుంది. అంతేకాదు… భర్తకి కెరీర్ బెస్ట్ ని అందించడంలో భాగమయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఈమె నటించిన చిత్రాలపై ఓ లుక్కేస్తే… ఆ సినిమాలలోని ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ లో భాగమవడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… నాగ చైతన్యతో కలిసి సామ్ నటించిన తొలి తెలుగు చిత్రం ‘ఏ మాయ చేసావే’. తొలి చిత్రంతోనే జెస్సీగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేసింది సామ్. ఈ సినిమాతో చైతు తొలి ఘన విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే… తారక్, సామ్ కాంబినేషన్ లో విజయవంతమైన రెండు చిత్రాలు ‘బృందావనం’, ‘జనతా గ్యారేజ్’ ఆయా సంవత్సరాలలో తారక్ కు కెరీర్ బెస్ట్ గా నిలవడం విశేషం. అలాగే… మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ విజయం గురించి వేరేగా చెప్పనక్కరలేదు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వసూళ్ళలో మంచి దూకుడును ప్రదర్శించడమే కాకుండా… మహేష్ కు కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అలాగే… యువ కథానాయకులు నాని (‘ఈగ’), నితిన్ (‘అఆ’)ల కెరీర్ బెస్ట్ మూవీస్ లో కూడా తన వంతు పాత్రను పోషించింది ఈ అక్కినేని వారి కోడలు. అంతేకాదు… అక్కినేని కుటుంబంతో కలిసి నటించిన ‘మనం’ చిత్రమైతే అప్పట్లో అక్కినేని ఫ్యామిలీ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం.

ఇక మెగా హీరోల విషయానికొస్తే…‘అత్తారింటికి దారేది’ అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో జత కట్టిన ఈ చెన్నై చిన్నది… ఆ సినిమా ఘన విజయంలో కూడా భాగమయింది. అలాగే… గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’లో రామలక్ష్మిగా మరోసారి ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా… అటు బాబాయి పవన్ కు ఇటు అబ్బాయి చరణ్ కు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో తన కంట్రిబ్యూషన్ ను కూడా అందించింది. ఈ విధంగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ… తనతో పాటు తన హీరోలకు కూడా కెరీర్ బెస్ట్ ను అందిస్తూ వస్తున్న సమంత… తన అప్ కమింగ్ మూవీ ‘ఓ బేబీ’తో మరోసారి విజయం సాధించి మరో యువ కథానాయకుడు నాగ శౌర్యకి కూడా బిగ్గెస్ట్ హిట్ ని ఇస్తుందేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=dgl5sS1Pda4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 15 =