ఓటర్ మూవీ నుండి థీమ్ సాంగ్ రిలీజ్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో ప్రారంభించారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమా థీమ్ సాంగ్ లిరికల్ వీడియోను ఈరోజు రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా సురభి నటిస్తుండగా… సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జాన్‌సుధీర్‌ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్. సంగీతం అందిస్తున్నాడు. మరి పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై బాగానే ఆసక్తి నెలకొంది. మ‌రి చూద్దాం ఈ సినిమా మంచు విష్ణుకి సక్సెస్ తెచ్చిపెడుతుందో?లేదో?

[subscribe]


[youtube_video videoid=EvZJQb28buA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + two =