పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో శర్వానంద్ మూవీ?

Sharwanand - Sudheer Varma Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sharwanand New Movie Updates,Actor Sharwanand Upcoming Movies,Sharwanand and Sudheer Varma Next Project Details,Sharwanand Next Film News
Sharwanand - Sudheer Varma Movie Latest Update

యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కథానుసారం… శర్వానంద్ ప్లే బాయ్, ఏజ్డ్ గ్యాంగ్ స్టర్.. ఇలా టు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తాడట.

గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన సింహ భాగం చిత్రీకరణ విదేశాలలో జరిగింది. అంతేకాదు… చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోందని సమాచారం.

శర్వానంద్ కి జోడిగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత చిత్రం ‘పడి పడి లేచే మనసు’ ఆశించని విజయం సాధించిన నేపథ్యంలో… ఈ సినిమాపై భారీ ఆశలనే పెట్టుకున్నాడు శర్వానంద్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here