జనసేన కోసం నితిన్ భారీ విరాళం

Nithiin Donates Huge Amount To Pawan Kalyan Janasena Party,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hero Nithiin Donates Amount For Janasena Party,Actor Nithiin Donates 25 Lakhs For Janasena Party,Nithiin Donates Money For Pawan Kalyan Party,Nithiin About Pawan Kalyan Janasena Party

పవన్ కళ్యాణ్ అంటే యంగ్ హీరో నితిన్ కు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ను ఇన్స్ఫిరేషన్ గా తీసుకునే తాను సినిమాల్లోకి వచ్చానని.. పవన్ అంటే తనకు పిచ్చని చాలా సందర్బాల్లో నితిన్ చెప్పాడు. ఇక తన సినిమా ఆడియో ఫంక్షన్లకు.. ప్రిరిలీజ్ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా పవన్‌నే ఆహ్వానిస్తుంటాడు. ఇక తనపై ఉన్న అభిమానం కారణంతో పవన్ కూడా నితిన్ పిలిచినవెంటనే కాదనకుండా వెళతాడు.

ఇదిలా ఉండగా మరోసారి నితిన్ పవన్ పై అభిమానాన్ని చూపించాడు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా బిజీగా ఉన్నాయి. దీనిలో భాగంగానే.. పవన్ ఎన్నికల ఖర్చు నిమిత్తం నితిన్ భారీ విరాళం అందించాడు. తన తరపున రూ.25 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. నితిన్ తండ్రి, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకొని.. నగదు చెక్ అందించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం పంపించారు. నితిన్‌కు, సుధాకర్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ తెలిపారు. మొత్తానికి పలువురు సెలబ్రిటీల నుండి పవన్ కు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నితిన్ ఇలాంటి సాయం అందించడం నిజంగా హర్షించతగ్గ విషయమే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here