విజయ్ దేవరకొండ తో ‘మజిలీ’ డైరెక్టర్

Majili Director To Work With Vijay Deverakonda?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Director Next With Vijay Deverakonda,Director Shiva Nirvana Next Project Details Revealed,Majili Director Shiva Nirvana New Movie With Vijay Deverakonda,Vijay Deverakonda To Team Up With Majili Director,Majili Director To Work With This Young Talent?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక సినిమా హిట్టయితే చాలు ఆఫర్లు వరుసపెట్టి వస్తూనే ఉంటాయి. అలాంటిది వరుసగా రెండు హిట్లు ఇస్తే ఆ డైరెక్టర్ కు మామూలు డిమాండ్ ఉండదు. ఇప్పుడు శివ నిర్వాణ కు అలాంటి డిమాండే పెరిగిపోయింది. నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన శివ నిర్వాణ… రీసెంట్ గా నాగచైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో మంచి ఫీల్ గుడ్ మూవీని తీసిన శివ నిర్వాణ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రెండు షేడ్స్ లో నాగ చైతన్య చాలా బాగా నటించాడని..సమంత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని… మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో.. నాగ చైతన్య భార్యగా శ్రావణి క్యారెక్టర్ లో జీవించేసిందని అంటున్నారు.

ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ తన తరువాత సినిమా విజయ్ దేవరకొండతో చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే మజిలీ సినిమా రిలీజ్ అయిన తరువాతే విజయ్ ఏ విషయమో చెబుతాడని.. సినిమా హిట్ అయితే అప్పుడు విజయ్ శివతో సినిమా చేయడానికి అవకాశం ఉందన్న టాక్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు శివ చెప్పిన స్టోరీకి విజయ్ పాజిటివ్ గానే రెస్పాన్స్ అయ్యాడని… గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూద్దాం ఇవి టాక్స్ వరకేనా.. లేక సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందా? లేదా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=h-L_wQT0Od4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =