చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మహానటి!

Keerthy Suresh Roped In For Chiranjeevi Next?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Koratala Siva Next With Actress Keerthy Suresh,Koratala Siva New Movie Updates,Keerthy Suresh to Star in Chiru Next,Keerthy Suresh Roped For Chiranjeevi Next Film,Koratala Siva In Talks With The Mahanati Actress For His Next Project

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటుండగా… మే చివరికల్లా దాదాపు సైరా షూటింగ్ ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తరువాత చిరు-కొరటాల కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందన్న సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ నెలాఖ‌రున ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాల‌ను లాంఛ‌నంగా జ‌రిపి… జూన్ నుంచి నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపనున్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. కొరటాల.. చిరు కాంబో మూవీలో మహానటి కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా, కాజల్ పేర్లు వినబడ్డాయి కానీ వారిలో ఎవరూ ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది. మరి కీర్తి సురేష్ అయినా ఫైనల్ అవుతుందో?లేదో? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=Xt7j28oBAh8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =