తక్కువ గ్యాప్ లో రానున్న ‘సీత’, ‘రాక్షసుడు’?

Bellamkonda Sreenivas Sita Movie,Sita and Rakshasudu To Release With A Very Less Gap,2019 Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,Bellamkonda Sreenivas New Movies,Sita Telugu Movie,Rakshasudu Telugu Movie,Bellamkonda Sreenivas Latest Movies

జయాపజయాలతో సంబంధం లేకుండా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘సీత’, ‘రాక్షసుడు’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ రెండు సినిమాలు కూడా రెండు నెలల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సీనియర్ డైరెక్టర్ తేజ రూపొందిస్తున్న ‘సీత’ వేసవి కానుకగా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో ఇదివరకెప్పుడూ కనిపించని పాత్రలో సాయి శ్రీనివాస్ దర్శనమివ్వనున్నాడు.

ఇక ‘రాక్షసుడు’ విషయానికి వస్తే… రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ ‘రాక్షసన్’ కి రీమేక్ గా రూపొందుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కాగా… ఈ సినిమాని జూన్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అంటే… రెండు నెలల గ్యాప్ లో సాయి శ్రీనివాస్ రెండు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించనున్నాడన్నమాట. మరి.. ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=TqaE5Z_-fFc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 1 =