మజిలీ తెలుగు మూవీ రివ్యూ

Majili Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Majili Review,Majili Movie Review,Majili Movie Review and Rating,Majili Movie Story,Majili Movie Live Updates,Majili Movie Plus Points,Majili Movie Public Talk,Majili Movie Public Response,#MajiliReview
Majili Telugu Movie Review

జరగబోయే కథ ఏమిటో ముందుగానే ఊహకు అందుతున్నప్పటికీ ఆసక్తి సన్నగిల్లకుండా సినిమాను ఎంజాయ్ చేయగలిగాము అంటే అందులోని ఎమోషనల్ కనెక్టివిటీయే అందుకు కారణం అవుతుంది. మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “మజిలీ” చిత్రంలో కనిపించింది కూడా అలాంటి కనెక్టివిటీయే. ” నిన్నుకోరి ” వంటి ఎమోషనల్ డ్రామా తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో “రీల్ అండ్ రియల్ లైఫ్ హిట్ పెయిర్” నాగచైతన్య- సమంత నటించిగా మంచి అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ ఎలా ఉందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూర్ణ( నాగ చైతన్య) విశాఖపట్నం రైల్వే క్వార్టర్స్ లో నివసించే ఒక అప్ కమింగ్ క్రికెట్ ప్లేయర్. రైల్వే జోన్ క్రికెట్ టీం కు సెలెక్ట్ అవ్వటం కోసం ప్రయత్నిస్తున్న పూర్ణ కు కొన్ని అనుకోని పరిస్థితుల్లో అంజు తో (దివ్యాన్షా కౌశిక్) పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. ఉన్నత శ్రేణి నావల్ ఆఫీసర్ అయిన అంజు తండ్రి (అతుల్ కులకర్ణి) వీరి ప్రేమను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తాడు. దానికి తోడు క్రికెట్ మ్యాచ్ ల విషయంలో స్థానిక రౌడీ బ్యాచ్ తో పూర్ణ కు అనేక సార్లు గొడవలు జరుగుతాయి. ఒకవైపు తను ప్రేమించే అంజు, మరోవైపు తనకు ప్రాణప్రదమైన క్రికెట్ కెరీర్.. మరోవైపు స్థానిక రౌడీలతో గొడవలు- ఇలాంటి స్థితిలో అంజు ఫ్యామిలీ వైజాగ్ నుండి దూరంగా వెళ్లి పోతుంది. ఏమైందో తెలీదు… ఎక్కడ ఉందో తెలీదు… పూర్ణ జీవితం నుండి అంజు దూరమవుతుంది. ప్రేమ పరంగా, కెరీర్ పరంగా పతనమై తాగుడుకు బానిసగా మారిన పూర్ణ జీవితంలోకి భార్యగా ప్రవేశిస్తుంది శ్రావణి( సమంత). అసలు ఈ శ్రావణి ఎవరు? ఎలాంటి పరిస్థితుల్లో ఆమె పూర్ణ భార్యగా వస్తుంది.? అన్ని విధాల పతనమైన పూర్ణ జీవితం ఒక అందమైన మలుపు తీసుకోవడానికి, గొప్ప లక్ష్యం వైపు నడవటానికి శ్రావణి చేసిన త్యాగం ఏమిటి? ఒక్కసారిగా పూర్ణ జీవితం నుండి వైదొలగిన అంజు ఏమైంది? ఉద్యోగం కోసం డెహ్రాడూన్ వెళ్లి పూర్ణ తన వెంట తెచ్చిన 13 ఏళ్ల గర్ల్ క్రికెటర్ ఎవరు? ఆ పాప రాక వల్ల పూర్ణ- శ్రావణి ల జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం గా నిలుస్తుంది మజిలీ ద్వితీయార్థం.

దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను హ్యాండిల్ చేయడంలో ఏ మేరకు సక్సెస్ అయ్యాడు అని విశ్లేషిస్తే- ప్రథమార్ధంలో స్లో అండ్ రొటీన్ నెరేషన్ తో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ శ్రావణి ప్రవేశంతో ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ రిమైనింగ్ ఫిల్మ్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. నిజానికి ఈ సినిమా ప్రారంభం నుండి వేర్ ఈస్ సమంత ? ఆమె ఎంట్రీ ఎప్పుడు? అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇంటర్వెల్ బ్యాంగ్ మంచి రిలీఫ్ ఇచ్చింది. ఇక సెకండాఫ్ ప్రారంభం నుండి దర్శకుడు శివ నిర్వాణ సాగించిన ఎమోషనల్ జర్నీ చాలా బాగుంది. కథ ఎక్స్పెక్టేషన్స్ కు అతీతమైనది కాకపోయినప్పటికీ ఒక్కో సన్నివేశం కొత్తగా, వైవిద్యంగా అనిపించాయి. “నిన్నుకోరి” అనే సెన్సిటివ్ కాన్సెప్ట్ ను చాలా సెన్సిబుల్ గా డీల్ చేసిన శివ నిర్వాణ మజిలీ చిత్రంలో కూడా అలాంటి ఎమోషనల్ ప్యాకేజ్ ని చాలా సెన్సిటివ్ గా రీ ప్రజెంట్ చేశాడు.
కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ను కూడా ఇంకా బెటర్ గా తీయగల అవకాశం ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో కాబోలు శివ నిర్వాణ ఫస్ట్ హాఫ్ ను కొంత నెగ్లెట్ చేసాడు అనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మజిలీ చిత్రం ద్వారా శివ నిర్వాణ మరొక మంచి ప్రామిసింగ్ డైరెక్టర్ గా ఎదిగాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్:

ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ ను విశ్లేషించి మార్కులు వేయాలి అంటే నాగ చైతన్య స్టాండ్స్ ఫస్టా? సమంత స్టాండ్స్ ఫస్టా ? అనే మీమాంస ఎదురవుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో గొప్ప భావోద్వేగాలను పలికించవలసిన సందర్భాల్లో నాగ చైతన్య , సమంత నువ్వా నేనా అన్నట్లుగా నటించి మెప్పించారు. అయితే నాగ చైతన్య పోషించిన పూర్ణ పాత్రలో రెండు ఏజ్ గ్రూప్ లకు సంబంధించిన వేరియేషన్ ఉండటం వల్ల ఫ్రర్స్టేటెడ్ అండ్ సెటిల్డ్ ఎమోషన్స్ ను చాలా చక్కగా అభినయించాడు నాగ చైతన్య. ఈ సినిమాతో నటుడిగా నాగ చైతన్య పర్ఫార్మెన్స్ లో కనిపించిన పరిణితి అతనిని ఒక గుడ్ యాక్టర్ గా నిలబెట్టింది. ఇక చిలిపి, శృంగార, శాంత, కరుణాది రసాల ఎమోషన్స్ అన్నింటిని పలికించడంలో సమంత యాక్టింగ్ హైట్స్ కు ప్రత్యేక ప్రశంస దక్కుతుంది. అంజు పాత్రలో దివ్యాన్షా కౌశిక్ నటన కూడా చాలా బాగుంది. ఇక 13 ఏళ్ల గర్ల్ క్రికెటర్ గా అనన్య చాలా బాగా నటించింది. హీరో తండ్రిగా రావు రమేష్, హీరోయిన్ తండ్రిగా పోసాని కృష్ణ మురళి, క్రికెట్ కోచ్ గా రవి ప్రకాష్, లోకల్ లీడర్ గా సుబ్బరాజు, నావల్ ఆఫీసర్ గా అతుల్ కులకర్ణి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

గోపి సుందర్ సంగీత సారధ్యంలో అన్ని పాటలు బాగున్నాయి. తమన్ రీ రికార్డింగ్ సన్నివేశాల్లోని ఆర్ద్రతను బాగా ఎలివేట్ చేసింది.
నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిల మేకింగ్ స్టాండర్డ్స్ బాగున్నాయి.

మొత్తం మీద మజిలీని భావోద్వేగాల చక్కని ప్రయాణంగా అభినందించటంలో ఎక్కువ క్రెడిట్స్ దర్శకుడు శివ నిర్వహణకు దక్కుతాయి.

మజిలీ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
4
Sending
User Review
0 (0 votes)

[subscribe]

[youtube_video videoid=msJBVpEm2ZE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 10 =