అఖిల్ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు?

Devi Sri Prasad To Score Tunes For Akhil New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Devi Sri Prasad Next Movie With Akkineni Akhil,Devi Sri Prasad To Compose Music For Akhil New Movie,Music Director Devi Sri Prasad New Movie Updates,Akhil New Movie Music Director
Devi Sri Prasad To Score Tunes For Akhil New Movie

`అఖిల్‌`, `హ‌లో`, `మిస్ట‌ర్ మ‌జ్ను` చిత్రాల‌తో అల‌రించిన యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్… త‌న నాలుగో సినిమాని `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ డైరెక్ష‌న్‌లో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించ‌నున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. అదే నిజ‌మైతే… అఖిల్‌, డీఎస్పీ కాంబినేష‌న్‌లో వ‌చ్చే మొద‌టి సినిమా ఇదే అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… అఖిల్ తండ్రి నాగార్జున‌, సోద‌రుడు నాగ‌చైత‌న్య‌కి దేవిశ్రీ కాంబోలో ప‌లు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా… వారిద్ద‌రికి ఫ‌స్ట్ కాంబోలో దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన సంద‌ర్భాల్లో ఘ‌న‌విజ‌యాలే ద‌క్కాయి. నాగ్ కాంబోలో తొలి చిత్ర‌మైన `మ‌న్మ‌థుడు`… చైతూ కాంబోలో మొద‌టి సినిమా అయిన `100 % ల‌వ్‌` మ్యూజిక‌ల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో… అఖిల్‌తోనూ తొలి చిత్రం ప‌రంగా డీఎస్పీ అచ్చొస్తాడేమో చూడాలి. అఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]
[youtube_video videoid=l2KmkThwcic]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =