ఫ్యాన్స్ కు ‘సీత’ టీమ్ సర్ ప్రైజ్

Sita Movie Team To Surprise Fans,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Sita Movie Latest Updates,Sita Movie Release Date,Kajal New Movie Sita Latest News,Bellamkonda Srinivas and Kajal New Movie Sita To Surprise Fans
Sita Movie Team To Surprise Fans

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కాని కొన్ని కారణాల వలన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని ఇప్పటికే టాక్స్ వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. సీత టీమ్ ఫ్యాన్స్ కు ఓ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రేపు అమరావతిలో జరగనున్న ఐటీ ఫెస్ట్ లో సీత టీమ్ పాల్గొననున్నారట. అక్కడ ఫ్యాన్స్ కు ఓ సర్ ప్రైజ్ ను రివీల్ చేయనున్నారట. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా రేపే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఏం సర్ ప్రైజ్ ఇస్తారో..!

కాగా కవచం సినిమాలో సందడి చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ మరోసారి సీత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అంతేకాదు మరి`ల‌క్ష్మీ క‌ళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` త‌రువాత తేజ – కాజ‌ల్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావండంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ ఆంచనాలను వీరు రీచ్ అవుతారో? లేదో? చూద్దాం.. ఇంకా ఈ సినిమాలో మ‌న్నారా చోప్రా, సోనూ సూద్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈసినిమాను అనిల్ సుంక‌ర, కిషోర్ గ‌రిక‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]
[youtube_video videoid=QIam1ccIb6c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =