మజిలీ కోసం థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీన రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతు టూ షేడ్స్ లలో ముఖ్యంగా మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక పాటలకు కూడా మంచి రెస్పాన్సే వస్తుంది. ముఖ్యంగా ప్రియతమా ప్రియతమా సాంగ్ అందరికీ తెగ నచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో థమన్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. అదేంటీ ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు కదా అన్న డౌట్ రావచ్చు..నిజమే కానీ పాటలు మాత్రమే గోపి సుందర్ అందించాడు. ఆ తరువాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ ఆపేయడంతో…థమన్ ను సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వమని అడిగారట. దానికి తనకెలాంటి అభ్యంతరం లేదని.. ఈ ప్రపోజల్ కి థమన్ ఒప్పుకున్నాడట.

ఇక థమన్ కూడా రీసెంట్ గా మంచి మ్యూజిక్కే అందించాడు. ఇక మజిలీ కూడా మంచి ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా కాబట్టి ఈసినిమాకు కూడా థమన్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తాడనే నమ్మకమే ఉంది.

కాగా ఈ సినిమాలో హిందీ నటి దివ్యంశ కౌశిక్ కూడా మరోక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=NWz9pdR3reQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =