విజ‌య్‌తో మ‌రో సినిమా చేయ‌నున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌

Vijay To Work With Talented Director Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tamil Actor Vijay Next Project Details,Actor Vijay To Work With Director Mohan Raja,Vijay New Movie With Director Mohan Raja,Director Mohan Raja Next With Hero Vijay
Vijay To Work With Talented Director Again

త‌మిళ‌నాట ఒక‌ప్పుడు రీమేక్‌ల స్పెష‌లిస్ట్ అనిపించుకున్న ఆ ద‌ర్శ‌కుడు… ఇప్పుడు ట్రాక్ మార్చి త‌నే రీమేక్‌ల‌కు సోర్స్ ఇస్తున్నాడు. ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు… `హ‌నుమాన్ జంక్ష‌న్‌` (2001)తో ద‌ర్శ‌కుడిగా అవ‌తార‌మెత్తిన మోహ‌న్ రాజా. ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన అగ్ర నిర్మాత‌`ఎడిట‌ర్‌` మోహ‌న్‌కి త‌న‌యుడైన రాజా… `హ‌నుమాన్ జంక్ష‌న్‌` త‌రువాత త‌మిళ చిత్ర సీమ బాట ప‌ట్టాడు. అక్క‌డ `జ‌యం`, `అమ్మ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి`, `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా`, `బొమ్మ‌రిల్లు` రీమేక్‌ల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నాడు. ఆ త‌రువాత ట్రాక్ త‌ప్ప‌డంతో… `త‌ని ఒరువ‌న్‌`తో స్ట్ర‌యిట్ పిక్చ‌ర్ తీసి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. క‌ట్ చేస్తే… ఆ సినిమానే తెలుగులో `ధ్రువ‌`గా రీమేక్ అయి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇలాంటి నేప‌థ్యం ఉన్న రాజా… అతి త్వ‌ర‌లో కోలీవుడ్ స్టార్ విజ‌య్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని త‌మిళ నాట క‌థ‌నాలు వ‌స్తున్నాయి. `వేలాయుధం` (2011) (`ఆజాద్‌` రీమేక్‌) త‌రువాత విజ‌య్‌, రాజా కాంబినేష‌న్‌లో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి. క్రితం సారి… రీమేక్ కోసం జ‌ట్టుక‌ట్టిన ఈ కాంబో… ఇప్పుడు స్ట్ర‌యిట్ ఫిల్మ్ తో రాబోతోంద‌ని టాక్‌. అన్న‌ట్టు… ఈ సినిమాని తెలుగులోనూ డ‌బ్బింగ్ చేసే అవకాశాలు లేక‌పోలేదు.

[subscribe]

[youtube_video videoid=cIEPLv3BwDw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − thirteen =