డియర్ కామ్రేడ్ టీజర్ రిలీజ్

Dear Comrade Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Telugu Movie Teaser,Dear Comrade Teaser,Dear Comrade Movie Official Teaser,Dear Comrade Movie Latest Updates,Dear Comrade Teaser,#DearComradeTeaser,Vijay Deverakonda New Movie Dear Comrade Teaser
Dear Comrade Movie Teaser Out Now

గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొంద, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళ‌ం, క‌న్న‌డ నాలుగు భాష‌ల‌లో ఒకేసారి టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ విషయానికొస్తే కడలల్లే వేచే కనులే.. కదిలేను నదిలా కలలే అనే లిరిక్స్ తో ఓ మెలొడి సాంగ్ వస్తుండగా… విజయ్ ఫైటింగ్ సీన్ వస్తూ చూడటానికి చాలా ఆకట్టుకుంది. ఆ తరువాత వెంటనే విజయ్, రష్మిక మధ్య ప్రేమ సన్నివేశం చూపించారు. అటు యాక్షన్ తో పాటు ఇటు లవ్ కూడా ఈక్వల్ గా చూపించినట్టు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఓవరాల్ గా టీజర్ మాత్రం సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది. చూడబోతే ఈ సినిమాతో కూడా రౌడి బాయ్ ఏదో చేసేలానే ఉన్నాడు.

కాగా లవ్‌ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకినాడ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తున్న విజయ్ దేవరకొండ కాకినాడ యాసలో అలరించనున్నాడు. రష్మిక మందనా మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది. మరి గీతగోవిందం సినిమాతో హిట్ కొట్టిన.. ఈ హిట్ కాంబో.. డియర్ కామ్రెడ్ సినిమాతో హిట్ అందుకుంటుందో.. లేదో.. చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=n3AqEHg6ofI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =