శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారు. ఇక గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా టీజర్ ఇటీవలే రిలీజవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్, నాగచైతన్య రఫ్ లుక్ హైలెట్ గా నిలిచాయి. ఇక ఇటీవలే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజా అప్ డేట్ ఏంటంటే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. అన్ని పనులు త్వరలో పూర్తి చేసుకొని ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ మరోక కీలక పాత్రలో నటిస్తుంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ రియల్ లైఫ్ రొమాంటిక్ జంటను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కూడా వీరిద్దరికీ మంచి సక్సెస్ అందించాలని కోరుకుందాం..
[youtube_video videoid=AZCJEgCH5Pk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: