కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను రూపొందించడంలో సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ శైలే వేరు. `అష్టా చమ్మా` నుంచి `సమ్మోహనం` వరకు ఇంద్రగంటి తెరకెక్కించిన పలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలోనే… మరో ఆసక్తికరమైన చిత్రం చేసేందుకు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా… నాని ఓ డిఫరెంట్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. అలాగే… నానికి జోడీగా అదితి రావ్ హైదరీ నటిస్తుండగా… సుధీర్‌కి జంటగా నివేదా థామస్ నటించనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ నలుగురు కూడా గతంలో ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాల్లో నటించిన వారే కావడం విశేషం. ఇప్పటికే `అష్టాచమ్మా`, `జెంటిల్ మన్` చిత్రాల్లో నాని… `జెంటిల్ మన్ `లో నివేదా… అలాగే `సమ్మోహనం`లో సుధీర్ బాబు, అదితి… నటించి మంచి విజయాలను నమోదు చేసుకున్నారు. అంతేకాదు… వీరిలో ఒక్క సుధీర్ బాబుని మినహాయిస్తే… మిగిలిన ముగ్గురూ ఇంద్రగంటి సినిమాలతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. మరి… వీరి అపూర్వ కలయికలో క్రిస్మస్ కానుకగా రానున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
[youtube_video videoid=36R_E-OYNIc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: