ఓటర్ టీజర్ రిలీజ్

Voter Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Telugu Movie Official Teaser,Voter Teaser,Voter Telugu Movie Teaser,#VoterTeaser,Voter Movie Latest Updates,Manchu Vishnu New Movie Voter Teaser
Voter Movie Teaser Out Now

జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

కాగా ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా సురభి నటిస్తుండగా… సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జాన్‌సుధీర్‌ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: రాజేష్‌ యాదవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ తనమల. ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

మరి కామెడీ, యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో ఇన్ని రోజులు ప్రేక్షకులను అలరించిన మంచు విష్ణు ఇప్పుడు కొత్తగా పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాతో వస్తున్నాడు. ఎలక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై బాగానే ఆసక్తి నెలకొంది. మ‌రి చూద్దాం ఈ సినిమా ఓటర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here