ఆర్ఆర్ఆర్ బులెట్ పాయింట్స్

RRR Movie Key Points,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Telugu Movie Latest News,RRR Movie Latest Updates,Rajamouli Reveals About RRR Movie,Rajamouli About RRR Movie Story,RRR Movie Details
RRR Movie Key Points

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ‘RRR’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, దానయ్య సినిమాకు సంబంధించి చాలా విషయాలను పంచుకున్నారు. మరి ఈసినిమాకు సంబంధించి వారి ఇచ్చిన అప్ డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథ

ఈ సినిమా కథ విషయంలో ఇప్పటికే ఎన్నో స్టోరీలు విన్నాం. అయితే ఈ ప్రెస్ మీట్ లో అసలు స్టోరీ ఏంటో రివీల్ చేశారు రాజమౌళి. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితాల స్పూర్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నానని రాజమౌళి చెప్పారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. తిరిగొచ్చాక స్వాతంత్య్ర ఉద్యమం మొదలుపెట్టారు.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు, ఒకరితో ఒకరు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు, ఒకరికొకరు ఇన్స్ఫిరేషన్ అయి ఉంటే.. వాళ్ల మధ్య స్నేహం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. నా సినిమా కంప్లీట్ గా ఫిక్షనల్ గా ఉంటుందని చెప్పారు.

రిలీజ్ డేట్

ఈ ప్రెస్ మీట్ లో సినిమా రిలీజ్ డేట్ ను కూడా రివీల్ చేశారు. 2020 లో జూలై 30న సౌత్ భాషల్లో ,నార్త్ లో కూడా విడుదల చేయనున్నామని తెలిపారు.

హీరోయిన్స్

హీరోయిన్ల విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ముందు నుండి అనుకున్నట్టే ఈసినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన డేజీ అడ్గారియన్స్ కనిపించనుంది.

పలు భాషల్లో

కేవలం తెలుగులోనే కాకుండా ఈసినిమాను పలు లాంగ్వేజస్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు పలు ఇండియన్ లాంగ్వేజస్ లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు పది భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

నటీనటులు

ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అజయ్ దేవగన్ నటించనున్నారు. ఇంకా తమిళ్ లో టాలెంటెడ్ నటుడు సముద్ర ఖని కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించారు.

టైటిల్

‘RRR’ వర్కింగ్ టైటిల్ అనుకున్నాం.. అదే బావుందని అన్నారు. అన్ని భాషల్లో ఇది కామన్ గా ఉంటుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ ఉంటుంది. అయితే టైటిల్‌ను మాత్రం ఇప్పుడే చెప్పలేను. అభిమానులనే టైటిల్‌ను గెస్‌ చేయమంటున్నాం. ఇప్పటికైతే టైటిల్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే అనుకుంటున్నామని తెలిపారు.

భారీ బడ్జెట్

ముందు నుండి అనుకున్నట్టుగానే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుమారు రూ.350 నుండి 400 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాత దానయ్య తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=WahpR5yMmb8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =