`క‌న‌క‌దుర్గ‌`గా ర‌వితేజ‌?

Interesting Update About Ravi Teja New Movie

మూడేళ్ళ క్రితం వేస‌వి కానుక‌గా విడుద‌లైన కాప్ స్టోరీ `తెరి`… త‌మిళ‌నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. విజ‌య్, స‌మంత‌, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అట్లీ రూపొందించిన ఈ చిత్రం… ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లోని థీమ్‌ని మాత్ర‌మే తీసుకుని… భారీ మార్పులు చేర్పుల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు సంతోష్‌. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే… `విక్ర‌మార్కుడు` త‌ర‌హాలోనే ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌న‌ర్‌లోనూ ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. కాగా… ఈ చిత్రానికి `క‌న‌క‌దుర్గ‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే ర‌వితేజ‌కి జోడీగా కాజ‌ల్‌, కేథ‌రిన్ పేర్లు వినిపిస్తుండ‌గా… దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యాల‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here