వెంకీ, రానా కాంబినేష‌న్‌లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌?

Latest New About Venkatesh And Rana Daggubati, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venkatesh – Rana Daggubati Multistarrer Movie On Cards?, Venkatesh – Rana Daggubati Multitstarrer Movie On Cards?, Venkatesh And Rana Daggubati Movie Latest News, Venkatesh And Rana Daggubati Multitstarrer Movie News
Venkatesh - Rana Daggubati Multitstarrer Movie On Cards?

మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్నాడు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. `సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతోనూ, `గోపాల గోపాల‌`లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనూ క‌ల‌సి సంద‌డి చేశాడు వెంకీ. అలాగే యువ క‌థానాయ‌కులు రామ్ (మ‌సాలా), వ‌రుణ్ తేజ్ (ఎఫ్ 2)తోనూ క‌ల‌సి న‌టించి అల‌రించాడు. వీటిలో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `ఎఫ్ 2`… ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో… ప్ర‌స్తుతం త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో `వెంకీ మామ‌` చేస్తున్నాడు వెంకీ. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద‌స‌రాకి స‌ర‌దాలు పంచనుంది.

ఇదిలా ఉంటే… `వెంకీ మామ‌` పూర్త‌వ‌కముందే మ‌రో మ‌ల్టీస్టారర్‌కి ప‌చ్చ జెండా ఊపాడ‌ట వెంకీ. ఈ సారి త‌న అన్న సురేష్ బాబు త‌న‌యుడు, యువ క‌థానాయ‌కుడు రానాతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడ‌ట వెంకీ. `బిందాస్‌` ఫేమ్ వీరు పోట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని… డి.సురేశ్ బాబు, అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

ఇదివ‌ర‌కు రానా హీరోగా న‌టించిన `కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌`లో వెంకీ ఓ ప్ర‌త్యేక గీతంలో త‌ళుక్కున మెరిసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. అలాగే కొన్ని యాడ్స్‌లోనూ ఈ `బాబాయ్ – అబ్బాయ్‌`లు అల‌రించారు. మ‌రి… ఫుల్ లెన్త్ మూవీతో ఏ స్థాయిలో మురిపిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here