ఎవరు వెనక్కి తగ్గుతారు?

Confusion on Vijay Deverakonda New Movie Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,KGF 2 Movie Updates,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates,Vijay Deverakonda New Movie News,Vijay Deverakonda Next Project Details
Confusion on Vijay Deverakonda New Movie title

విజయదేవరకొండ ప్రస్తుతం ఫుల్ ఫామ్ ఉన్నాడు. వరుస విజయాలతో.. కొత్త ప్రాజెక్ట్ లతో జిబీ బిజీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తాను డియర్ కామ్రేడ్ తో పాటు మరో కొత్త సినిమాతో బిజీగా ఉండగానే.. తాజాగా మరో న్యూ ప్రాజెక్ట్ లో నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫైనల్‌ చేసినట్టుగా చిత్రయూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. విజయ్ సినిమా టైటిల్ ను అలా అనౌన్స్ చేసిన కొద్ది గంటలకే తమిళ స్టార్ హీరో కార్తికేయన్ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించారు. అందులో చిక్కేముందంటారా? అసలు సంగతేంటంటే.. ఆసినిమా టైటిల్ కూడా హీరోనే. దీంతో తమిళంలో విజయ్ దేవరకొండ కానీ శివ కార్తీకేయన్ కానీ ఎవరో ఒక్కళ్ళు తమ సినిమా టైటిల్ మార్చుకోవాలి. మరి విజయ్ ముందే అనౌన్స్ చేశాడు కాబట్టి.. శివకార్తికేయనే మార్చుకుంటాడా..? లేదా ఎవరి ఇమేజ్ వారిది కదా అని లైట్ తీసుకుంటారా? మరి ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు వెనెక్కి తగ్గి తమ సినిమా పేరు మార్చుకుంటారు? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=bKx0sHtLM6Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =